ఒక్క స్థానం కోసం ముగ్గురు మధ్య పోటీ.. వరల్డ్ కప్‌లో ఆ స్పాట్ కోసం ట్రయాంగిల్ ఫైట్!
వరల్డ్ కప్ టైమ్ దగ్గర పడుతుంది.. ఇప్పటివరకు టీమిండియా తుది జట్టు కూర్పు సెట్ అవ్వకపోవడం ఘోరం.. 2015, 2019లోనూ ఇదే తప్పిదం మన కొంపముంచింది.. మరోసారి అదే తలనొప్పి దాపరించింది..!

race between ishan kishan sanju samson kl rahul for wicket keeper spot for world cup 2023
ఇషాన్‌కిషాన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్..ఈ ముగ్గురిలో ఎవరు వరల్డ్ కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటారు..? ఇప్పుడిదే ప్రశ్న సగటు టీమిండియా అభిమానిని వేధిస్తుంది. నిజానికి కేఎల్ రాహుల్ వన్డేలో మంచి ప్లేయరే.. అందులోనూ ప్రపంచ కప్ జరుగుతుంది ఇండియాలోనే కావడంతో షార్ట్ పిచ్ బంతులతో పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ ఐపీఎల్ టైమ్‌లో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. ప్రస్తుతం రికవరీ ఫేజ్‌లో ఉన్నాడు. ఇదే సమయంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ అదరగొట్టాడు. వరుసపెట్టి హాఫ్ సెంచరీలు బాదాడు.. మరోవైపు సంజూ శాంసన్‌కి వన్డేలో అదిరిపోయే యావరేజ్ స్ట్రైక్ రేట్ ఉంది. మరి వీళ్ల ముగ్గురిలో ఎవర్ని ఫైనల్ చేస్తారు?
ప్రస్తుత ఫామ్ గురించి మాట్లాడుకుంటే ఇషాన్ కిషాన్‌ని పరిగణలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ చెబుతుండగా.. సంజూ శాంసన్‌కి ఈసారి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు అభిమానులు. ఎందుకంటే వన్డేల్లో 50కి పైగా సగటుతో పాటు 100కుపైగా స్ట్రైక్ రేట్ సంజూ సొంతం. ప్రతిసారి అతనికి అవకాశాలు ఇవ్వకుండా తొక్కెస్తున్నారని.. నంబర్స్ మేటర్ అంటున్నారు అతని సపోర్టర్స్. వన్డేల్లో డబుల్ హండ్రెడ్ తర్వాత ఇషాన్ కిషాన్ అట్టర్‌ఫ్లాప్ అయ్యాడని గుర్తు చేస్తున్నారు. ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయిన విండీస్ జట్టుపై మూడు 50లు బాదినంతా మాత్రానా అతడిని ఎలా కన్సిడర్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
అటు ప్రపంచ కప్ టైమ్‌కి రాహుల్ అందుబాటులోకి వస్తాడని సమాచారం. అయితే గాయం తర్వాత రాహుల్ నుంచి గొప్ప ప్రదర్శన ఆశించలేమన్న వాదన కూడా వినిపిస్తోంది. అందులోనూ టుక్ టుక్ ప్లేయర్‌గా మనోడిపై కొంతకాలంగా చాలా విమర్శలున్నాయి. ఇక మరికొంతమంది ఆలోచన మరోలా ఉంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ని తప్పించాలని.. అతను టీ20లకు తప్ప వన్డేలకు పనికిరాడని చెబుతున్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అలా చేస్తే జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండొచ్చని.. రాహుల్ కంటే సంజూ ఫ్రొఫెషనల్ వికెట్ కీపర్ కావడంతో అతడినే తుది జట్టులో ఆడిస్తే సరిపోతుంది. అటు 2015, 2019లోనూ నాలుగో నంబర్ స్థానం కోసం చివరి వరకు ఎటూ తేల్చుకోలేకపోయిన టీమిండియా సెమీస్‌లో భారీ ముల్యం చెల్లించుకుంది. ఈసారి అలా జరగకూడదు. వరల్డ్ కప్‌కి రెండు నెలల ముందు కూడా తుది జట్టు సెట్ అవ్వకపోవడం ఏంటో అర్థంకాని దుస్థితి. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ ఇప్పటికైనా మేలుకోని.. ప్రయోగాలు చేయడం ఆపితే మంచిది.