Rahul Dravid: అదరగొడుతున్న జూనియర్ వాల్.. ద్రావిడ్ కొడుకు బ్యాటింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా
ప్రస్తుతం ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఇటీవలే కూచ్ బెహార్ ట్రోఫీలో ద్రావిడ్ స్టైల్ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. పలు మ్యాచ్‌లలో అద్భుతమైన కవర్ డ్రైవ్‌లతో అదరగొట్టాడు.
Rahul Dravid: భారత క్రికెట్‌లో రాహుల్ ద్రావిడ్‌ది ప్రత్యేకమైన స్థానం. దిగ్గజ ఆటగాడిగా కోట్లాది మంది ఫ్యాన్స్‌ను అలరించిన మిస్టర్ డిపెండబుల్.. క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకే. ఒక్కసారి కుదురుకున్నాడంటే ప్రత్యర్థి విజయాన్ని అడ్డుగోడ కట్టేసినట్టే. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో భారత జట్టును ఎన్నోసార్లు ఓటమి నుంచి కాపాడిన ద్రావిడ్ ది వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కోచ్‌గా మారి భారత జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.
BIG BOSS CASE : బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇకపై ర్యాలీలు నిషేధించే ఛాన్స్ !
అంతేకాదు భారత క్రికెట్‌కు తన వారసులని కూడా తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఇటీవలే కూచ్ బెహార్ ట్రోఫీలో ద్రావిడ్ స్టైల్ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. పలు మ్యాచ్‌లలో అద్భుతమైన కవర్ డ్రైవ్‌లతో అదరగొట్టాడు. తండ్రి ట్రేడ్ మార్క్ షాట్‌ను సేమ్ టూ సేమ్ దించేశాడు. ప్రస్తుతం అతని బ్యాటింగ్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు. సమిత్ కేవలం బ్యాట్‌తోనే కాదు బంతితోనూ ఆకట్టుకున్నాడు. 3 వికెట్లు కూడా తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కూడా అండర్ 19 క్రికెట్‌లో రాణిస్తున్నాడు.
ప్రస్తుతం కర్ణాటక జట్టుకు అన్వయ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక కోచ్‌గా బిజీగా ఉన్నప్పటికీ అప్పడప్పుడు తన కుమారులను ప్రోత్సహించేందుకు ద్రావిడ్ సతీసమేతంగా గ్రౌండ్స్‌కు వెళుతున్నాడు. నిజానికి దిగ్గజ ఆటగాళ్ల వారసుల్లో చాలామంది క్రికెట్‌లో సక్సెస్ కాలేదు. ఆ సంప్రదాయానికి చెక్ పెడుతూ ద్రావిడ్ ఇద్దరు కుమారులు క్రికెట్‌లో సత్తా చాటుతుండడం భారత ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తోంది.