Rahul Dravid: అండర్-19 జట్టులో ద్రావిడ్ వారసుడు..
ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ఐపీఎల్ సమయంలో తన తండ్రి క్రికెట్ ఆట చూస్తూ పెరిగాడు. క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే చిన్న కొడుకు అన్వయ్‌కి మాత్రం తన తండ్రి ఆట చూసే అదృష్టం కలగలేదు. అయితే తనయులు ఇద్దరూ మాత్రం తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు రెడీ అవుతున్నారు.

Rahul Dravid: టీమిండియా ప్రధాన కోచ్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్, కర్ణాటక అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న వినూ మన్కడ్ ట్రోఫీకి ఎంపికైన 15 మంది సభ్యుల కర్ణాటక జట్టులో 17 ఏళ్ల సమిత్‌కు చోటు దక్కింది. కాగా రాహుల్ ద్రవిడ్ ఇద్దరు పిల్లలు తమ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కొడుకు సమిత్, చిన్న కొడుకు అన్వయ్ ఇద్దరూ క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ఐపీఎల్ సమయంలో తన తండ్రి క్రికెట్ ఆట చూస్తూ పెరిగాడు.
క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే చిన్న కొడుకు అన్వయ్‌కి మాత్రం తన తండ్రి ఆట చూసే అదృష్టం కలగలేదు. అయితే తనయులు ఇద్దరూ మాత్రం తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు రెడీ అవుతున్నారు. రెండేళ్ల క్రితం అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అన్వయ్.. అన్నయ్య సమిత్‌తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బీటీఆర్ షీల్డ్ అండర్ 14 స్కూల్ టోర్నమెంట్‌లో సోదరులిద్దరూ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇందులో వికెట్ కీపర్, బ్యాటర్ అయిన అన్వయ్ ద్రవిడ్ 90 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన U-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక U-14 జట్టుకు నాయకత్వం వహించాడు.
దీనికి ముందు, 2019-20 ఇంటర్-జోనల్ మ్యాచ్‌లలో అతను 2 డబుల్ సెంచరీలు చేశాడు. ఇక ఇప్పుడు పెద్ద కుమారుడు సమిత్.. ఏకంగా కర్ణాటక అండర్-19 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈసారి వినూ మన్కడ్ టోర్నీ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ అండర్-19 టోర్నీ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది. మరి హైదరాబాద్‌లో జరిగే ఈ టోర్నీలో రాహుల్ ద్రవిడ్ కొడుకు ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.