Rahul : రాహుల్ పూర్తి ఫిట్ నెస్ తో లేడా ? కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై అనుమానాలు
స్టార్ క్రికెటర్ (Star Cricketer) కే ఎల్ రాహుల్ (KL Rahul) పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా...ఐపీఎల్ లో అతన్ని హడావిడిగా ఆడిస్తున్నారా..తాజా పరిణామాలు చూస్తే అందరికీ ఇదే డౌట్ వస్తోంది. రాహుల్ హఠాత్తుగా సారధ్య బాథ్యతల నుంచి తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.
స్టార్ క్రికెటర్ (Star Cricketer) కే ఎల్ రాహుల్ (KL Rahul) పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా…ఐపీఎల్ లో అతన్ని హడావిడిగా ఆడిస్తున్నారా..తాజా పరిణామాలు చూస్తే అందరికీ ఇదే డౌట్ వస్తోంది. రాహుల్ హఠాత్తుగా సారధ్య బాథ్యతల నుంచి తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. రాహుల్ స్థానంలో నికోలస్ పూరన్ లక్నో జట్టు పగ్గాలను అందుకున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని లక్నో ఫ్రాంచైజీ తాత్కాలికంగా తీసుకుందా లేదా ఈ సీజన్ మొత్తానికా అనే విషయంపై స్పష్టత లేదు. సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఇటీవల గాయం నుంచి కోలుకున్న రాహుల్‌పై పనిభారం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని పూరన్ తెలిపాడు.
అయితే ఈ నిర్ణయం వెనకు మర్మం ఏంటనే చర్చలు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ అనంతరమే పనిభారం గురించి రాహుల్ కెప్టెన్సీని (Rahul’s captaincy) వదులుకున్నాడంటే.. అసలు అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదేమో అనే సందేహాలు మొదలయ్యాయి. గత ఐపీఎల్ సీజన్‌లో గాయపడి కొన్ని నెలల పాటు ఆటకు దూరమైన రాహుల్ ఆసియాకప్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ (World Cup) అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తిరిగి గాయపడ్డాడు. తొలి టెస్టు అనంతరం ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు తిరిగి ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు.