పంత్ కు రూ.30 కోట్లు ఏ జట్టు కొంటుందో చెప్పేసిన రైనా

మెగావేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అయ్యాయి. వచ్చే ఆదివారం,సోమవారం సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఈ సారి మెగా ఆక్షన్ కావడంతో స్టార్ ప్లేయర్స్ లో చాలా మంది వేలంలోకి రావడం మరింత హైప్ క్రియేటయింది. వేలంలో ఎవరు జాక్ పాట్ కొడతారో... అత్యధిక ధర ఎవరికి వస్తుందో అన్న అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2024 | 01:50 PMLast Updated on: Nov 21, 2024 | 1:50 PM

Raina Said Which Team Will Buy The Pant

మెగావేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అయ్యాయి. వచ్చే ఆదివారం,సోమవారం సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఈ సారి మెగా ఆక్షన్ కావడంతో స్టార్ ప్లేయర్స్ లో చాలా మంది వేలంలోకి రావడం మరింత హైప్ క్రియేటయింది. వేలంలో ఎవరు జాక్ పాట్ కొడతారో… అత్యధిక ధర ఎవరికి వస్తుందో అన్న అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సారి అందరినీ ఆకర్షిస్తున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది రిషబ్ పంతే… ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను రిటైన్ చేసుకోకపోవడంతో ఈ యువ వికెట్ కీపర్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు ఫ్రాంచైజీలు పంత్ పై ఆసక్తిగా ఉన్నాయి. కెప్టెన్ గా మంచి రికార్డుండడం, యువ ఆటగాడు కావడం, వికెట్ కీపర్ గానే కాకుండా హిట్టర్ గానూ అదరగొట్టే పంత్ కోసం మూడు ఫ్రాంచైజీలు గట్టిగానే ట్రై చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో అతనికి ఎంత ధర పలుకుతుందన్న దానిపై మాజీ ఆటగాళ్ళు తమ అంచనాలు చెబుతున్నారు.

తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా పంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రిషభ్ పంత్‌కు భారీ డిమాండ్ దక్కనుందని సురేశ్ రైనా తేల్చేశాడు. కనీసం 25 కోట్లు నుంచి 30 కోట్లు వరకు పంత్‌పై బిడ్‌లు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎక్కువ ధర పొందడం చూశామని, కానీ ఈ సారి మనోళ్లు ఆల్‌టైమ్ రికార్డు ధర పలుకుతారని రైనా జోస్యం చెప్పాడు. ముఖ్యంగా పంత్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా ప్రయత్నించే ఛాన్సుందని రైనా చెప్పుకొచ్చాడు. వారి దగ్గర మనీ పర్స్ కూడా ఎక్కువగా ఉండడం మరో కారణమన్నాడు.
రిషభ్ పంత్‌తో మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు కూడా వేలంలో భారీ బిడ్లు దక్కే అవకాశం ఉందని రైనా చెప్పాడు. పంత్ గన్ ప్లేయర్‌ అని, గన్ వికెట్ కీపర్ అని కొనియాడాడు. పంత్ ఎక్కడున్నా కప్‌ను సాధించే స్వభావంతో ముందుకు వెళ్తాడని అన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా అదే స్వభావంతో శ్రమిస్తారని చెప్పాడు. అయితే కొన్ని జట్లు ఈసారి ప్లేయర్ల కోసమే కాదని, కెప్టెన్ల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీలు భారత కెప్టెన్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాయని రైనా తెలిపాడు. పంజాబ్ వద్ద అందరి కంటే ఎక్కువగా 110.50 కోట్లు ఉన్నాయని, పంత్ కోసం ఆ టీమ్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుందని రైనా అంచనా వేశాడు. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా 2023 సీజన్ మినహా.. మిగిలిన అన్ని సీజన్లలో ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 35.31 సగటుతో, 148.93 స్ట్రైక్‌రేటుతో 3284 పరుగులు చేశాడు.