అతనికి కెప్టెన్సీ చేయడం రాదు రైనా సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ మెగా వేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాపై తర్జన భర్జన పడుతున్నాయి. ఎవరిని కొనసాగించాలి...
ఐపీఎల్ మెగా వేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాపై తర్జన భర్జన పడుతున్నాయి. ఎవరిని కొనసాగించాలి… ఎవరిని వేలంలోకి వదిలేయాలన్న దానిపై సుదీర్ఘంగా ఆలోచిస్తూనే ఉన్నాయి. అటు పలువురు మాజీ క్రికెటర్లు సైతం రిటైన్ ప్లేయర్స్ జాబితాల గురించి తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇదే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై విమర్శలు గుప్పించాడు. రుతురాజ్ కు కెప్టెన్సీ చేతకాదంటూ రైనా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అంచనాలను అందుకోలేదన్నాడు. గత సీజన్ లోరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి అతని కెప్టెన్సీ లోపాలకు ఉదాహరణగా చెప్పుకొచ్చాడు.
దీని ప్రకారం చూసుకుంటే రుతురాజ్ కు మరో ఏడాది సమయం అవసరమని అభిప్రాయపడ్డాడు. అందుకే వచ్చే సీజన్ లోనూ ధోనీ ఐపీఎల్‌లో ఆడి రుతురాజ్ కు అండగా నిలవాలని రైనా సూచించాడు. కాగా రుతురాజ్ సారథ్యంలో చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టింది. గత సీజన్ లో 14 మ్యాచ్‌లు ఆడి ఏడే విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడానికి ఆర్సీబీతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. అయితే వచ్చే సీజన్ లో ధోనీ ప్లేయర్ గా ఉంటాడా లేక మెంటార్ గా వ్యవహరిస్తాడా అన్నది మెగా వేలం తర్వాత తేలిపోనుంది.