Rajasthan Royals : పరాగ్ ఇదేం పని ?
రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ తన యాటిట్యూడ్ తో ఓవరాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Rajasthan Royals player Ryan Parag is recognized as an overaction star with his attitude
రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ తన యాటిట్యూడ్ తో ఓవరాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత తన రొటీన్ లైఫ్ ను స్టార్ట్ చేసిన పరాగ్ ఒక పనితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పరాగ్ ఆన్ లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఇదే పరాగ్ ను చిక్కుల్లో పడేసింది. ఈ సెషల్ లో భాగంగా పరాగ్ తన యూట్యూబ్ ను ఓపెన్ చేశాడు. అందులో అతడి సెర్చ్ హిస్టరీని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. పరాగ్ సెర్చ్ హిస్టరీలో బాలీవుడ్ స్టార్స్ అనన్య పాండే హాట్, సారా అలీఖాన్ హాట్, విరాట్ కోహ్లీ అని ఉంది.
తన సెర్చ్ హిస్టరీని అతడు హైడ్ చేయకపోవడంతో.. ఒక్కసారిగా అవి ప్రత్యక్షం అయ్యాయి. దీంతో హీరోయిన్ల అందాల కోసం ఇంతలా సొల్లు కార్చాలా అంటూ నెటిజన్లు పరాగ్ పై మండిపడుతున్నారు.