రాజస్థాన్ రాయల్స్ చెత్త ఫీల్డింగ్, జైపూర్ లో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్నందుకుంది. సొంతగడ్డపై తడబడుతున్నఆర్‌సీబీ.. ప్రత్యర్థి వేదికలపై తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్నందుకుంది. సొంతగడ్డపై తడబడుతున్నఆర్‌సీబీ.. ప్రత్యర్థి వేదికలపై తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. పర్యావరణ పరిరక్షణ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ మ్యాచ్‌ను గ్రీన్ జెర్సీలో ఆడిన ఆర్‌సీబీ.. తమ రికార్డ్‌ను మెరుగుపరుచుకుంది. గ్రీన్ జెర్సీలో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు చెత్త ఫీల్డింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను చేజార్చుకుంది. 6 క్యాచ్‌లతో పాటు ఒక రనౌట్ అవకాశాన్ని చేజార్చకొని మూల్యం చెల్లించుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75 రన్స్ చేయగా.. హాఫ్ రియాన్ పరాగ్ 30, ధ్రువ్ జురెల్35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్‌సీబీ 17.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దేవదత్ పడిక్కల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓపెనర్లు ఎటాకింగ్ బ్యాటింగ్ తో చెలరేగిపోయారు. సీజన్ లో తమ ఫామ్ కొనసాగిస్తూ రాయల్స్ బౌలర్లను ఆటాడుకున్నారు. పేలవమైన ఫీల్డింగ్ కూడా రాజస్థాన్ ఓటమికి కారణమైంది. సందీప్ శర్మ వేసిన మరుసటి ఓవర్‌లో కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రియాన్ పరాగ్ నేలపాలు చేశాడు. అప్పటికీ విరాట్ కోహ్లీ చేసింది 7 పరుగులు మాత్రమే. ఈ క్యాచ్ డ్రాప్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
అదే ఓవర్ ఐదో బంతికి ఫిల్ సాల్ట్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సందీప్ శర్మ అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసిన 6వ ఓవర్‌లో ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్‌తో పాటు రనౌట్ అవకాశాన్ని యశస్వి జైస్వాల్ వృథా చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే ఆర్‌సీబీ బ్యాటర్లు ఇచ్చిన 4 అవకాశాలను రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అందిపుచ్చుకోలేకపోయారు. దీంతో ఈజీగానే ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది. ఈ గెలుపుతో సీజన్ లో నాలుగో విజయాన్ని అందుకున్న బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్ కు చేరింది.