Rajat Patidar: రజత్ పాటిదార్‌కు గోల్డెన్ ఛాన్స్.. కోహ్లీ స్థానంలో ఎంపిక
30 ఏళ్ల పాటిదార్.. సీనియర్లైన పుజారా, రహానే, యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, రియాన్ పరాగ్‌ల నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికీ.. అంతిమంగా సెలెక్టర్లు ఈ మధ్యప్రదేశ్ ఆటగాడివైపే మొగ్గు చూపారు. ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్‌పై వరుస సెంచరీలతో విరుచుకుపడిన పాటిదార్ ఎంపిక ముందుగానే ఊహించారు.

Rajat Patidar: రజత్ పాటిదార్ జాక్‌పాట్ కొట్టాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు కోహ్లి స్థానంలో ఎంపికయ్యాడు. ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్‌పై వరుస సెంచరీలతో విరుచుకుపడిన పాటిదార్ ఎంపిక ముందుగానే ఊహించారు. 30 ఏళ్ల పాటిదార్.. సీనియర్లైన పుజారా, రహానే, యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, రియాన్ పరాగ్‌ల నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికీ.. అంతిమంగా సెలెక్టర్లు ఈ మధ్యప్రదేశ్ ఆటగాడివైపే మొగ్గు చూపారు.
India vs England: తొలి టెస్టులో స్పిన్ మంత్రమే.. భారత్ తుది జట్టే ఇదే
గతేడాది చివర్లో జరిగిన సౌతాఫ్రికా పర్యటనలో వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాటిదార్.. ఆ సిరీస్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన పాటిదార్.. తాను ప్రాతినిథ్యం వహించిన జట్ల తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగేవాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో తుది జట్టులో అవకాశం వస్తే మాత్రం నాలుగో ప్లేస్‌లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.
ఒకవేళ టీమిండియా మేనేజ్‌మెంట్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం కల్పించాలని భావిస్తే పాటిదార్ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు. కొద్ది రోజుల కిందట కోహ్లి తొలి రెండు టెస్ట్‌లకు అందుబాటులో ఉండడని తెలియడంతో సెలెక్టర్లు పాటిదార్‌ను అతని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు.