Sarfaraz Khan: సర్ఫరాజ్, పాటిదార్‌లలో ఎవరికి ఛాన్స్.. తేల్చేసిన బ్యాటింగ్ కోచ్
ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్.. తుది జట్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్‌లలో ఒకరికే తుదిజట్టులో అవకాశం దక్కుతుందని చెప్పాడు. సర్ఫరాజ్, రజత్‌లలో ఒకరినే ఎంచుకోవడమనేది కఠినమైన ఎంపికని, వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లన్నాడు.

Sarfaraz Khan: ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్టు ఓటమి అనంతరం భారత్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్.. తుది జట్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్‌లలో ఒకరికే తుదిజట్టులో అవకాశం దక్కుతుందని చెప్పాడు.
PAWAN KALYAN-ATLLE: క్రేజీ కాంబో.. పవన్‌తో అట్లీ మూవీ.. రూ.1000 కోట్ల బడ్జెట్
అలాగే వరుసగా విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ జట్టులో కొనసాగుతారని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. సర్ఫరాజ్, రజత్‌లలో ఒకరినే ఎంచుకోవడమనేది కఠినమైన ఎంపికని, వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లన్నాడు. దేశవాళీలో గత కొన్నేళ్లుగా గొప్పగా రాణిస్తున్నారనీ, తుది జట్టు కూర్పుపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. ఇక వైజాగ్ పిచ్‌ను అంచనా వేయడం అంత తేలిక కాదని వ్యాఖ్యానించాడు. తొలి రోజు నుంచి అయినా టర్న్ అవ్వొచ్చు లేదా క్రమంగా స్పిన్‌కు అనుకూలించవచ్చని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే టెస్టుల్లో కాస్త ఓపిగ్గా ఆడాలని సూచించాడు.
వికెట్, పరిస్థితులను బట్టి ఆ షాట్ సురక్షితమా కాదా అని నిర్ధారించుకునే తెలివితేటలు బ్యాటర్లకు ఉండాలని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మన బ్యాటర్లు భారీషాట్లకు యత్నించి ఔటవగా.. రెండో ఇన్నింగ్స్‌లో అతిజాగ్రత్తకు వెళ్లి వికెట్లు సమర్పించుకున్నారు.