Virat Kohli: విరాట్ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్..?
మ్యాచ్ ఆరంభానికి ముందు రణబీర్.. మైదానంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వ్యాఖ్యాత జతిన్ సప్రుతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ బయోపిక్‌పై స్పందించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ మీరు చేయాలనుకుంటున్నారా? అని జతిన్ సప్రు ప్రశ్నించాడు.

Virat Kohli: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తొలి సెమీ ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు చాలా మంది సెలెబ్రిటీస్ మైదానంకు వచ్చారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ స్టేడియంకు వచ్చి సందడి చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందు రణబీర్.. మైదానంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వ్యాఖ్యాత జతిన్ సప్రుతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ బయోపిక్‌పై స్పందించాడు.
Virat Kohli: రికార్డుల మోత మోగించిన కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలు..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ మీరు చేయాలనుకుంటున్నారా? అని జతిన్ సప్రు అడగ్గా.. రణబీర్ కపూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కోహ్లీ బయోపిక్‌లో అతడు నటిస్తేనే బాగుంటుందని రణబీర్ అభిప్రాయపడ్డాడు. ‘విరాట్ కోహ్లీపై బయోపిక్ తీస్తే.. అందులో కోహ్లీ పాత్రను కోహ్లీనే పోషించాలి. ఎందుకంటే.. విరాట్ చాలా మంది నటుల కంటే మెరుగ్గా కనిపిస్తాడు. కోహ్లీ ఫిట్‌నెస్ కూడా చాలా బాగుంది’ అని రణబీర్ కపూర్ చెప్పాడు. ఇక ఈ సెమీ ఫైనల్‌లో భారత్ దూకుడుగా ఆడుతోంది. కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.