15 ఏళ్ళకే రంజీ అరంగేట్రం ,గంగూలీ రికార్డ్ బ్రేక్
రంజీ క్రికెట్ లో అరుదైన రికార్డు నమోదైంది. 10వ తరగతి చదువుతున్న ఓ కుర్రాడు రంజీ అరంగేట్రం చేశాడు. తద్వాారా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు.
రంజీ క్రికెట్ లో అరుదైన రికార్డు నమోదైంది. 10వ తరగతి చదువుతున్న ఓ కుర్రాడు రంజీ అరంగేట్రం చేశాడు. తద్వాారా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. బెంగాల్ కు చెందిన అంకిత్ ఛటర్జీ కేవలం 15 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.
హర్యానాతో మ్యాచ్ లో బరిలోకి దిగిన అతను.. బెంగాల్ తరపున అతి చిన్న వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. హెయిర్‌లైన్ ఫ్రాక్చర్‌తో అభిమన్యు ఈశ్వరన్ గాయంతో తప్పుకోవడంతో ఈ యువ క్రికెటర్ కు అవకాశం దక్కింది. సౌరవ్ గంగూలీ 17 ఏళ్ళ వయస్సులో 1989-90 రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. 35 ఏళ్ళ తర్వాత అంకిత్ ఛటర్జీ ఈ రికార్డ్ బ్రేక్ చేశాడు.