Ranji Trophy: రంజీ ట్రోఫీలో దుమ్మురేపిన చెన్నై ప్లేయర్స్
సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్‌కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు.

Ranji Trophy: రంజీ ట్రోఫీ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ఫామ్ కొనసాగిస్తున్నారు. వేర్వేరు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ దుమ్ము రేపారు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు.
Suhani Bhatnagar: చిన్న వయసులోనే కన్నుమూసిన దంగల్ నటి.. కారణం ఇదే..
ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్‌కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు. శార్దూల్ కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒకే రోజు ముగ్గురు సీఎస్‌కే ఆటగాళ్లు సత్తా చాటడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ఈసారి కూడా ప్రత్యర్దులకు దబిడిదిబిడే అంటూ రచ్చ చేస్తున్నారు. సీఎస్‌కే ఆటగాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఈసారి టైటిల్ నిలబెట్టుకోవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్‌లో ధోని నేతృత్వంలో సీఎస్‌కే ఐదో సారి ఛాంపియన్‌గా నిలిచింది.
రాబోయే సీజన్‌కు సంబంధించి సీఎస్‌కే ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్‌ను స్టార్ట్ చేసింది. కెప్టెన్ ధోనితో పాటు అందుబాటులో ఉన్న ప్లేయర్లతో క్యాంప్ నడుస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు కూడా ధోని నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.