Sachin Tendulkar: ఎవరైనా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే.. బీసీసీఐ నిర్ణయంపై సచిన్ ప్రశంసలు
అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించింది.

Sachin Tendulkar: దేశవాళీ క్రికెట్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించింది.
IND VS ENG: చివరి టెస్టుకు ఎక్స్‌ట్రా పేసర్.. టీమ్ కాంబినేషన్‌పై రోహిత్ కామెంట్స్
ఇటీవల వార్షిక కాంట్రాక్టులలో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు మొండిచేయి చూపింది. రంజీ బరిలో దిగాలన్న కోచ్ ఆదేశాలను పెడచెవిన పెట్టారనే కారణంతో వారిద్దరిపై వేటు వేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా రంజీ ట్రోఫీ ప్రాధాన్యంపై స్పందించాడు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ముంబై తరఫున ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూసే వాడినని సచిన్ గుర్తు చేసుకున్నాడు.
ఈ టోర్నీల్లో ఆడటం వల్ల ఫామ్‌లేమితో ఇబ్బంది పడేవాళ్లు తిరిగి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పొరపాట్లను సరిచేసుకునే అవకాశం దొరుకుతుందన్నాడు. స్టార్ క్రికెటర్లు డొమెస్టిక్ టోర్నీల్లో ఆడితే క్రమక్రమంగా అభిమానులు కూడా దేశవాళీ జట్లకు మద్దతుగా నిలుస్తారని అభిప్రాయ పడ్డాడు.