TILAK VARMA: శతక్కొట్టిన హైదరాబాదీ కుర్రాడు.. రంజీ మ్యాచ్‌లో తిలక్ వర్మ ధనాధన్..
టీమిండియాలో ఇప్పుడిప్పుడే తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంటున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ.. రంజీ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపాడు.
TILAK VARMA: భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడం ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఎప్పటికప్పుడు ఫామ్ కొనసాగిస్తేనే జాతీయ జట్టులో చోటు ఉంటుంది. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చూపించాల్సిందే. టీమిండియాలో ఇప్పుడిప్పుడే తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంటున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ.. రంజీ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపాడు.
MS DHONI: ధోనీని మోసం చేసిన స్నేహితుడు.. కేసు పెట్టిన మిస్టర్ కూల్..
కొత్త ఏడాదిలోనూ తన ఫామ్ కంటిన్యూ చేస్తూ 112 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. ఆరంభంలోనే రోహిత్ రాయుడు వికెట్ చేజార్చుకున్నా.. రాహుల్ సింగ్, మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ దూకుడుగా ఆడారు. రాహుల్ సింగ్ డబుల్ సెంచరీ చేయగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి సెంచరీ సాధించాడు.
తొలి రోజు ఆట ముగిసే సరికి 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ జట్టు.. ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. గత ఏడాది టీ ట్వంటీ, వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ రంజీల్లోనూ జోరు కొనసాగిస్తుండడంతో టెస్ట్ జట్టులో కూడా త్వరలోనే అడుగుపెడతాడని హైదరాబాదీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు