మరో 7 సిక్సర్లు కొడితే… రోహిత్ ముంగిట అరుదైన రికార్డ్
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం భారత్ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం భారత్ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది. ఇంకా జట్టును ప్రకటించకపోయినా ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ షురూ చేశాడు. అటు పలువురు యువ ఆటగాళ్ళు దులీప్ ట్రోఫీ బరిలో దిగారు. కాగా బంగ్లాదేశ్ తో సిరీస్ ముంగిట రోహిత్ శర్మ అరుదైన రికార్డు ఊరిస్తోంది. టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు సాధించేందుకు రోహిత్ ఏడు సిక్సర్లు దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగబోయే సిరీస్‌లో మరో ఏడు సిక్సర్లు కొడితే టీమిండియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
సెహ్వాగ్ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదితే… ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 84 సిక్సర్లు ఉన్నాయి. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరి తర్వాత ధోని , సచిన్ , రవీంద్ర జడేజా ఉన్నారు. ఇక విరాట్ కోహ్లి టెస్టుల్లో కేవలం 26 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఓవరాల్ గా మూడు ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు మాత్రం హిట్ మ్యాన్ పేరిటే ఉంది. హిట్‌మ్యాన్ తన కెరీర్‌లో 483 మ్యాచ్‌లు ఆడి 620 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో 553 సిక్సర్లతో క్రిస్ గేల్ రెండో స్థానంలోనూ, 476 సిక్సర్లతో షాహిద్ అఫ్రిది మూడో స్థానంలోనూ ఉన్నారు.