jaishwal : ఒక బాల్ కే 13 పరుగులు… జైశ్వాల్ అరుదైన రికార్డ్
క్రికెట్ లో అప్పుడప్పుడు అరుదైన రికార్డులు నమోదవుతూ ఉంటాయి. తాజాగా జింబాబ్వేతో ఐదో టీ ట్వంటీలో ఎవ్వరూ ఊహించని రికార్డ్ నమోదైంది.

Rare records are recorded in cricket from time to time.
క్రికెట్ లో అప్పుడప్పుడు అరుదైన రికార్డులు నమోదవుతూ ఉంటాయి. తాజాగా జింబాబ్వేతో ఐదో టీ ట్వంటీలో ఎవ్వరూ ఊహించని రికార్డ్ నమోదైంది. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కనివినీ ఎరుగని రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే 13 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. తొలి ఓవర్‌ను జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా వేసాడు. ఫస్ట్ బాల్‌ను అతను నోబాల్‌గా వేయగా.. యశస్వి జైస్వాల్ సిక్స్ బాదాడు.
ఫ్రీ హిట్‌గా లభించిన మరుసటి బంతిని జైస్వాల్.. బ్యాక్‌ఫుట్‌లో స్ట్రైట్‌గా సిక్సర్ కొట్టాడు. దాంతో ఒక్క బంతికే టీమిండియాకు 13 పరుగులు లభించాయి. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ చరిత్రకెక్కాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ప్రస్తుతం ఈ రికార్డ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.