Ravi Shastri: మళ్లీ స్ట్రాంగ్‌గా రీ ఎంట్రీ ఇవ్వండి.. అయ్యర్, ఇషాన్‌కు రవిశాస్త్రి సలహా

తమ ఆదేశాలను పెడచెవిన పెట్టి, దేశవాళీ టోర్నీలో పాల్గొనని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌‌లను సెంట్రల్ కాంట్రాక్ట్‌ లిస్ట్ నుంచి తప్పించి బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ యువ క్రికెటర్లకు ధైర్యాన్నిస్తూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 03:19 PMLast Updated on: Feb 29, 2024 | 3:19 PM

Ravi Shastri Issues Sharp Message For Shreyas Iyer And Ishan Kishan

Ravi Shastri: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు కోల్పోయిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లకు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. అధైర్య పడకుండా ముందుకు సాగమని హితవు పలికాడు. తమ ఆదేశాలను పెడచెవిన పెట్టి, దేశవాళీ టోర్నీలో పాల్గొనని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌‌లను సెంట్రల్ కాంట్రాక్ట్‌ లిస్ట్ నుంచి తప్పించి బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ యువ క్రికెటర్లకు ధైర్యాన్నిస్తూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.

500 GAS CYLINDER: రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇస్తారంటే..

క్రికెట్‌లో పునరాగమనాన్ని స్ఫూర్తిగా నిర్వచిస్తారనీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్.. తల ఎత్తుకుని సవాళ్లను ఎదుర్కోమని సూచించాడు. బలంగా రీఎంట్రీ ఇవ్వాలని, ఇద్దరూ మరోసారి జయిస్తారనడంలో తనకేలాంటి సందేహం లేదంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఫాస్ట్ బౌలర్లను ప్రోత్సహించేందుకు పేసర్లకు స్పెషల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ నిర్ణయాన్ని రవిశాస్త్రి అభినందించాడు. ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్‌తో గేమ్ ఛేంజింగ్‌ నిర్ణయాన్ని బీసీసీఐ, జై షా తీసుకోవడం అభినందనీయమన్నాడు.

ఈ ఏడాదిని గొప్పగా సిద్ధం చేయడానికి ఇది కీలక నిర్ణయమన్నాడు. టెస్టు క్రికెట్, దేశీయ క్రికెట్‌కు ప్రాధాన్యతకు ఇది మంచి సందేశంగా చెప్పుకొచ్చాడు. క్రికెట్ భవిష్యత్‌కు సరైన స్వరాన్ని సిద్ధంచేస్తున్నారని రవిశాస్త్రి మరో ట్వీట్ చేశాడు.