Ravichandran Ashwin: అశ్విన్, బెయిర్ స్టో @ 100.. మరో మైలురాయికి దగ్గర్లో అశ్విన్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టోకు ఈ మ్యాచ్ వారి కెరీర్‌లో వందో టెస్ట్. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌తో వేర్వేరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు 100 టెస్ట్‌ల మార్కును అందుకోవడం ఇది మూడోసారి మాత్రమే.
Ravichandran Ashwin: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘట్టానికి భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ వేదిక కానుంది. రెండు జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరుగనున్న ఈ టెస్టుతో ఇద్దరు ప్లేయర్లు మ్యాచ్‌ల సెంచరీలు కొట్టబోతున్నారు. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టోకు ఈ మ్యాచ్ వారి కెరీర్‌లో వందో టెస్ట్. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌తో వేర్వేరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు 100 టెస్ట్‌ల మార్కును అందుకోవడం ఇది మూడోసారి మాత్రమే.
Jasprit Bumrah: బూమ్రా రీఎంట్రీ, రాహుల్ ఔట్.. ఐదో టెస్టుకు భారత జట్టు ఇదే
కాగా ఈ సిరీస్ అశ్విన్ కెరీర్‌లో చిరకాలం గుర్తుండిపోతుంది. అశ్విన్ ఈ సిరీస్‌లో దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. మూడో మ్యాచ్‌లో 500 వికెట్ల మైలురాయితో చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ సిరీస్‌లో అశ్విన్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసాడు. ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన అశ్విన్.. 507 వికెట్లు పడగొట్టి, 3309 పరుగులు చేశాడు. ఇందులో 35సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించగా, 5 సెంచరీలు కూడా ఉన్నాయి. మరోవైపు కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడనున్న ఇంగ్లండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఫామ్ లేమి సమస్య తెగ కలవరపెడుతుంది.
భారత్‌తో సిరీస్‌లో అతను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో బెయిర్‌స్టో వందో మ్యాచ్‌లోనైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి. బెయిర్‌స్టో ఇప్పటివరకు ఆడిన 99 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలతో 5974 పరుగులు చేశాడు.