Oneday World Cup: ఇద్దరు సూర్యులు వన్డే వరల్డ్‌కప్ నుంచి ఔట్?
ఒకరు ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ స్పిన్నర్.. ఇంకొకరు విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు వన్డే ప్రపంచకప్ ఆడే ఛాన్సులు దాదాపుగా కనిపించట్లేదు.
ఇక వారెవరో కాదు రవిచంద్రన్ అశ్విన్, సూర్యకుమార్ యాదవ్. రాబోయే ఆసియా కప్ టోర్నీ, అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం జట్టు కూర్పుపై కసరత్తులు మొదలుపెట్టాడు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ప్రస్తుతం విండీస్‌లో ఉన్న అతడు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లతో ఈ అంశంపై చర్చించనున్నాడు. ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన రవిచంద్రన్ అశ్విన్.. వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంతకాలం వైట్-బాల్ క్రికెట్‌లో టీమిండియాకు రవీంద్ర జడేజా ప్రధాన స్పిన్నర్‌గా మాత్రమే కాదు.. ఆల్‌రౌండర్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు.
వరల్డ్‌కప్ రేసులో కూడా అతడే ముందు వరుసలో ఉండటం గమనార్హం. మరోవైపు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు వన్డే ఫార్మాట్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. అతడు టీ20ల్లో రాణిస్తున్నప్పటికీ.. వన్డేలలో మాత్రం తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతున్నాడు. దీంతో యాజమాన్యం అతడిపై వేటు వేసి.. కేవలం టీ20లకే పరిమితం చేసే ఛాన్సులు లేకపోలేదు. అటు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తుండగా.. వరల్డ్‌కప్‌నకు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఈ ఇద్దరు ప్లేయర్స్ డైరెక్ట్‌గా చోటు దక్కించుకుంటారు. కాబట్టి..! టీమిండియా పొమ్మనలేక.. పొగబెడుతూ.. అశ్విన్, సూర్యకుమార్ యాదవ్‌లను వన్డేలకు గుడ్‌బై చెప్పిస్తోంది.