Ravichandran Ashwin: టీమిండియాకు బిగ్ షాక్.. మూడో టెస్ట్ నుంచి తప్పుకున్న అశ్విన్
కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్.. బీసీసీఐ అనుమతితో జట్టును వీడి చెన్నైకి బయల్దేరాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అశ్విన్‌కు బోర్డు అండగా ఉంటుందని తెలిపింది.
Ravichandran Ashwin: ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్ ఆసక్తికరంగా జరుగుతున్న వేళ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ నుంచి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకున్నాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్.. బీసీసీఐ అనుమతితో జట్టును వీడి చెన్నైకి బయల్దేరాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
Baba Vanga: ఈ ఏడాది భయానకం.. ప్రపంచమంతా చీకట్లు! నీళ్ళుండవ్ ! వంగా చెప్పింది జరుగుతుందా..?
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అశ్విన్‌కు బోర్డు అండగా ఉంటుందని తెలిపింది. అశ్విన్, అతడి కుటంబ సభ్యుల గోప్యతకు భంగం కలిగించవద్దని మీడియా, అభిమానులకు బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు బోర్డుకు ఎంతో ముఖ్యమని చెప్పింది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఓ వికెట్ తీసిన అశ్విన్.. టెస్ట్‌ల్లో 500 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్రకెక్కాడు. అశ్విన్ తల్లి ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి దగ్గరగా ఉండటం కోసం అశ్విన్ చెన్నైకి వెళ్లాడని తెలిపారు. అశ్విన్ గైర్హాజరీ టీమిండియాకు తీరని నష్టం చేయనుంది. ఇప్పటికే ఫ్లాట్ వికెట్‌పై ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో దుమ్మురేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక బౌలర్ లేకుండా అందుబాటులో ఉన్న నలుగురితోనే బౌలింగ్ చేయించడం రోహిత్ కెప్టెన్సీకి సవాల్‌గా మారనుంది.