Ravichandran Ashwin: అశ్విన్ వందో మ్యాచ్.. చివరి టెస్టులోనూ అదరగొడతాడా..!
ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్‌కు ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేసి ఇంకో విజయాన్ని అందిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకోవడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు.
Ravichandran Ashwin: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే ధర్మశాలలో గురువారం నుంచి ప్రారంభమయ్యే అయిదో టెస్టుకు ఓ ప్రత్యేకత ఉంది. టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోలకు ఇది కెరీర్‌లో వందో టెస్టు. ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్‌కు ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేసి ఇంకో విజయాన్ని అందిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
IND VS ENG: చివరి టెస్టుకు ఎక్స్‌ట్రా పేసర్.. టీమ్ కాంబినేషన్‌పై రోహిత్ కామెంట్స్
ఈ సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకోవడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. 4 టెస్టుల్లో 17 వికెట్లు తీసిన అతడు.. బ్యాటింగ్‌లోనూ కొన్ని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడో టెస్టు మధ్యలో వ్యక్తిగత కారణంతో జట్టును వీడినా.. వెంటనే తిరిగి వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్.. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఒంటిచేత్తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు.
23.91 సగటుతో వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న అశ్విన్.. 100వ టెస్టు ఆడబోతున్న 14వ భారత ఆటగాడిగా నిలవబోతున్నాడు. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అశ్విన్.. వందో టెస్టులోనూ తన మార్కు చూపించి జట్టుకు 4-1తో విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.