Ravindra Jadeja: ధోనీ ఇంటి గేట్ ముందు జడేజా.. వైరల్‌గా మారిన ఫోటోలు
గత సీజన్ ఫైనల్లో జడేజా 6, 4 కొట్టి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ.. రవీంద్ర జడేజాను హత్తుకొని ఎత్తుకున్నాడు. వీరిద్దరి బాండింగ్ చాలా స్పెషల్ అనేది అప్పుడే అర్థమయింది.

Ravindra Jadeja: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మధ్య రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత జట్టుకు వీరిద్దరూ ఎన్నో విజయాలను అందించారు. జడేజా లాంటి ప్లేయర్‌ను ఎప్పుడు ఎలా వాడుకోవాలో ధోనీకి బాగా తెలుసు. ఐపీఎల్‌లోనూ వీరి జోడి చెన్నై సూపర్ కింగ్స్‌ను అయిదు సార్లు విజేతగా నిలిపింది. గత సీజన్ ఫైనల్లో జడేజా 6, 4 కొట్టి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
Ishan Kishan: దారిలోకి వచ్చిన అయ్యర్, ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్ బరిలో యువ క్రికెటర్లు
మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ.. రవీంద్ర జడేజాను హత్తుకొని ఎత్తుకున్నాడు. వీరిద్దరి బాండింగ్ చాలా స్పెషల్ అనేది అప్పుడే అర్థమయింది. తాజాగా ధోనీ అంటే ఎంత ఇష్టమో జడేజా మరోసారి చెప్పకనే చెప్పాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ రాంచీలో జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం జడేజా రాంచీలోని ధోని ఇంటికి వెళ్లాడు. లోపలికి వెళ్లేముందు గేటు బయట ఫొటోలకు ఫోజులిచ్చాడు.
ఈ ఫొటోలను తాజాగా.. జడేజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అభిమాన ఆటగాడి ఇంటి ముందు అభిమాని అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. ధోనీ, జడేజా అనుబంధం సమ్‌థింగ్ స్పెషల్ అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
View this post on Instagram