Anuj Rawat : క్యాచ్ చేజారే…మ్యాచ్ చేజారే ఎంత పని చేశావ్ రావత్
క్రికెట్ (Cricket) లో ఒక్క క్యాచ్ చాలు మ్యాచ్ మలుపు తిరగడానికి... అందుకే అంటారు క్యాచేస్ విన్ మ్యాచేస్ అని... తాజాగా ఒక్క క్యాచ్ చేజారడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమికి కారణం అయింది.
క్రికెట్ (Cricket) లో ఒక్క క్యాచ్ చాలు మ్యాచ్ మలుపు తిరగడానికి… అందుకే అంటారు క్యాచేస్ విన్ మ్యాచేస్ అని… తాజాగా ఒక్క క్యాచ్ చేజారడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమికి కారణం అయింది. లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఫీల్డర్ అనుజ్ రావత్ ఒక క్యాచ్ మిస్ చేయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ మూడో బంతిని నికోలస్ పూరన్ (Nicholas Pooran) భారీ షాట్ ఆడాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ కాలేదు. దాంతో వికెట్లకు సమీపంలోనే బంతి గాల్లోకి లేచింది. ఫీల్డర్ అనూజ్ రావత్ (Anuj Rawat) చేతిలో పడినా దాన్ని వదిలేశాడు. అప్పటికి నికోలస్ స్కోరు 3 పరుగులు మాత్రమే. ఆ లైఫ్ తో బతికిపోయిన నికోలస్ రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఏకంగా ఐదు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి స్కోరు బోర్డును 180 పరుగులు దాటించాడు. 21 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే, లక్నో స్కోరు 150-160కే పరిమితమయ్యేదనీ… ఆర్సీబీ గెలిచేదని అంటున్నారు. ఎందుకంటే అప్పటికే బ్యాటర్లు అందరూ అవుట్ అయిపోయారు. నికోలస్ కూడా అయిపోతే లక్నో స్కోరు కంట్రోల్ అయ్యేదని అంటున్నారు. ఆర్సీబీకి దురదృష్టం కూడా వెంటాడుతోందని అభిమానులు ఆవేదనగా కామెంట్లు పెడుతున్నారు. నాలుగు మ్యాచ్ లు ఆడి, ఒక దాంట్లో విజయం సాధించి మూడింట ఓడిన ఆర్సీబీ (RCB) జట్టు రేసులో వెనుకపడింది.