ఫైనల్ హోరాహోరీనే గెలుపు ఎవరిదో తేల్చేసిన రాయుడు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే టైటిల్ పోరులో భారత్ , న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2025 | 01:15 PMLast Updated on: Mar 07, 2025 | 1:15 PM

Rayudu Decided The Winner In The Final Battle

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే టైటిల్ పోరులో భారత్ , న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఓటమి లేకుండా ఫైనల్స్ కు చేరుకోగా.. కానీ న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉంది. న్యూజిలాండ్ జట్టులో కూడా నలుగురు అద్భుతమైన స్పిన్ బౌలర్లు ఉన్నారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. ఏ జట్టు ఫైనల్ లో గెలుస్తుందో అంచనా వేయడం కొంచెం కష్టమే. అయినప్పటికీ భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోందని కొందరు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫైనల్ ఎలా ఉంటుందో సీఎస్కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అంచనా వేశాడు. ఫైనల్ భారత్ కు సవాలుగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. రెండు జట్లు బలంగా ఉన్నందున ఈ మ్యాచ్ అభిమానులకు మంచి క్రికెట్ విందు అందుస్తుందన్ అంబటి రాయుడు చెప్పాడు. రెండు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారని.. కానీ న్యూజిలాండ్ జట్టులో నలుగురు ఆటగాళ్లు మాత్రమే మ్యాచ్ వినర్లు అని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో భారత జట్టులో మొత్తం 11 మంది ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లేనని విశ్లేషించాడు.

ఇది భారత జట్టు గెలిచేందుకు మంచి అవకాశాన్ని ఇవ్వబోతుందని రాయుడు చెప్పాడు. కానీ న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ భారత్ ను ఇబ్బంది పెడతాడని అంచనా వేశాడు. సాంట్నర్ తన బౌలింగ్ తో ముఖ్యమైన వికెట్లు తీస్తాడని.. భారత ఆటగాళ్లను చాలా ఒత్తిడికి గురి చేస్తాడన్నాడు. అయితే భారత జట్టులో విరాట్ కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారని.. భారత్ జట్టులోని సీనియర్లు న్యూజిలాండ్ బౌలింగ్ ను అద్భుతంగా ఎదుర్కొంటారన్నాడు. కాగా సెమీస్ లో భారత్ , ఆస్ట్రేలియాను ఓడించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫైనల్ కు ముందు ఫామ్ లోకి రావడం భారత్ కు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. అటు కివీస్ కూడా సెమీస్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. కేన్ విలియంసన్, రచిన్ రవీంద్ర , డారెల్ మిచెల్ అదరగొడుతున్నారు. అయితే 2000 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమికి రివేంజ్ తీర్చుకునేందుకు ఇదే సరైన సమయమని భారత్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.