రాయుడు విధ్వంసం భారత్ దే ఇంటర్నేషనల్ మాస్టర్స్

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి జోష్ లో ఉన్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు వెటరన్ క్రికెటర్లు సైతం మరో టైటిల్ అందించారు. రిటైరయిన దిగ్గజ క్రికెటర్ల కోసం నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ టైటిల్ ను ఇండియా మాస్టర్స్ కైవసం చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2025 | 03:55 PMLast Updated on: Mar 18, 2025 | 3:55 PM

Rayudu Destroys Bharat De International Masters

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి జోష్ లో ఉన్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు వెటరన్ క్రికెటర్లు సైతం మరో టైటిల్ అందించారు. రిటైరయిన దిగ్గజ క్రికెటర్ల కోసం నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ టైటిల్ ను ఇండియా మాస్టర్స్ కైవసం చేసుకుంది. సచిన్ సారథ్యంలోని మన జట్టు ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సచిన్ వర్సెస్ లారా పోరుగా హైప్ క్రియేట్ అయిన ఈ మ్యాచ్ లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. బౌలింగ్ లో వినయ్ కుమార్, నదీమ్… బ్యాటింగ్ లో అంబటి రాయుడు మెరుపులతో ఇండియా మాస్టర్స్ ఈజీగానే గెలిచింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. దూకుడుగానే ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన విండీస్ ను ఇండియా మాస్టర్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. లో ఓపెనర్‌ స్మిత్‌ 35 బంతుల్లో45 పరుగులు చేయగా.. ) కెప్టెన్‌ బ్రియాన్‌ లారా నిరాశపరిచాడు. తర్వాత సిమ్మన్స్ 41 బంతుల్లో 57 రన్స్ చేయడంతో విండీస్ మాస్టర్స్ మంచి స్కోర్ చేయగలిగింది. భారత్‌ మాస్టర్స్‌ బౌలర్లలో వినయ్‌ కుమార్‌ 3 వికెట్లు తీయగా.. నదీమ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. నేగి, బిన్నీ తలో వికెట్ దక్కించుకున్నారు.

149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మాస్టర్స్.. 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్‌ అంబటి రాయుడు మెరుపు బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. విండీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. రాయుడు 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ సచిన్ కూడా ధాటిగా ఆడాడు. సచిన్ 18 బంతుల్లో 2 ఫోర్లు , 1సిక్సర్ తో 25 రన్స్ చేసి ఔటయ్యాడు. తొలి వికెట్ కు సచిన్ , రాయుడు 67 పరుగులు జోడించారు. సచిన్ ఔటైన తర్వాత యువరాజ్ సింగ్, స్టువర్ట్ బిన్నీ ధాటిగా ఆడడంతో
టార్గెట్ ను అందుకునే క్రమంలో ఇండియా మాస్టర్స్ పెద్దగా కష్టపడలేదు. కాగా ఈ టోర్నీ ఆద్యంతం ఇండియా మాస్టర్స్ జట్టు దుమ్మురేపింది. యువరాజ్ , స్టువర్ట్ బిన్నీతో పాటు రాయుడు కూడా పలు కీలక మ్యాచ్ లలో రాణించారు. ఫలితంగా లీగ్ స్టేజ్ లో ఐదు మ్యాచ్ లలో నాలుగింట గెలిచిన ఇండియా మాస్టర్స్ సెమీస్ లో ఆసీస్ ను చిత్తు చేసింది. ఫైనల్లోనూ మెరుపులు మెరిపించిన అంబటి రాయుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. రిటైరయిన పలువురు క్రికెటర్లు ఈ టోర్నీలో సందడి చేశారు. ఇండియా మాస్టర్స్ తో పాటు శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా , సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్లు ఆడాయి.