RCB : 18వ నంబర్ లో ఆర్సీబీ ఫ్యూచర్
ఐపీఎల్ 17వ సీజన్ కీలక దశకు చేరుకుంది. టోర్నీలో లీగ్ స్టేజ్ ముగింపు దశకు వచ్చినా కేవలం రెండు టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
ఐపీఎల్ 17వ సీజన్ కీలక దశకు చేరుకుంది. టోర్నీలో లీగ్ స్టేజ్ ముగింపు దశకు వచ్చినా కేవలం రెండు టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. వాటిలో సన్ రైజర్స్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన జట్లలో చెన్నై , ఆర్సీబీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఆర్సీబీ, డీసీ, లక్నో 12 పాయింట్లతో ఉన్నాయి. ఆ రెండు టీమ్స్ కంటే ఆర్సీబీకి మంచి రన్‌రేట్ ఉంది. దీంతో.. సీఎస్‌కేపై మంచి తేడాతో ఆర్సీబీ గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది.
ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆర్సీబీ కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ జాతకం అంతా 18వ నంబర్ చుట్టూ తిరుగుతోంది. ఈ మ్యాచ్ ఈ నెల 18వ తేదీన జరగనుంది. ఒక వేళ ఆర్సీబీ ముందు బ్యాటింగ్ చేస్తే.. సీఎస్‌కును 18 అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో ఓడించాలి. ఒక వేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే.. 18.1 ఓవర్లలో లోపలే టార్గెట్‌ను అందుకోవాలి. అప్పుడే సీఎస్‌కే కంటే మెరుగైన రన్ రేట్‌ను సాధించి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక సీజన్ ఆరంభం నుంచి పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18. ఇలా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఫ్యూచర్ ను ఆ 18 నంబరే డిసైడ్ చేయబోతోంది.