RCB Team: వాళ్లు గెలిచినట్లే.. ఈ బుడ్డిది స్కూల్‌లో చేరినట్లే.. ఆర్సీబీని మళ్లీ ఆడుకుంటున్న నెటిజన్లు..
దురదృష్టానికి పిన్‌కోడ్ లేకుండా లెటర్ వేస్తే వెళ్లి చేరేది ఆర్సీబీ దగ్గరికే అనే టాక్ ఉంది క్రికెట్‌వర్గాల్లో ! టీమ్ బలంగా ఉంటుంది.. కెప్టెన్ స్ట్రాంగ్‌గా ఉంటాడు.. అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయ్. కానీ ప్రతీసారి దరిద్రం వెక్కిరిస్తూ ఉంటుంది. కప్ నమ్‌దే అని ప్రతీసారి అనుకోవడం.. నిరాశ సీజన్ ముగించడం.. మళ్లీ ఇయర్ మళ్లీ స్టార్ట్.. పాపం ఇదే పరిస్థితి ఆర్సీబీది ! ఐపీఎల్ ఆరంభం నుంచి ఇదే పరిస్థితి.
ఈ సీజన్‌లో అయినా గెలుస్తారా అనుకుంటే.. మళ్లీ తుస్సుమనిపించేలా కనిపిస్తోంది ఆర్సీబీ టీమ్. ఐతే ఆర్సీబీ దరిద్రాన్ని ఇండికేట్ చేసేలా.. ఇప్పుడో ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరు మ్యాచ్‌లో ఓ చిన్నారి పట్టుకున్న ప్లకార్డు.. ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది. బెంగళూరు జెర్సీ వేసుకున్న బుడ్డిది.. ఆర్సీబీ జట్టు IPL గెలిచే వరకు స్కూల్‌లో జాయిన్ అవ్వను అంటు ప్లకార్డు పట్టుకుంది. ఇదే ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చకు దారి తీస్తోంది. వీళ్లు గెలిచినట్లే.. ఆ చిన్నారి స్కూల్‌కు వెళ్లినట్లే అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. ఈ పాప ఏ ఇయర్‌లో స్కూల్‌లో జాయిన్ అవుతుందో చెప్పండి అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
గెలవాల్సిన మ్యాచ్, గెలుస్తుందనుకున్న మ్యాచ్ కూడా గెలవడం లేదు ఆర్సీబీ ఈ మధ్య. బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ కూడా అంతే ! బెంగళూరుదే విజయం అనుకున్నారు అంతా ! నాలుగు వికెట్లు కూలాయో లేదో సీన్ మొత్తం రివర్స్ అయింది. కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్‌వెల్.. ఈ ముగ్గురి మీదే బ్యాటింగ్ అంతా ఆధారపడి ఉంటుంది. బౌలింగ్‌లో సిరాజ్ తప్పితే మరో బౌలర్ చేయి ఫాస్ట్‌గా తిప్పడం లేదు. దీంతో ఈసారి కూడా ఆర్సీబీకి నిరాశ తప్పేలా కనిపించడం లేదు.
2007ల ఐపీఎల్ మొదలైతే.. అప్పటి నుంచి RCB ఏ సీజన్ లోనూ గెలవలేదు. ఇప్పుడీ చిన్నారితో ఇలాంటి ప్లకార్డులు మోస్తే ఇక ఆ పాప స్కూల్ కి వెళ్లినట్లే అని జనం కామెంట్లు పెడుతున్నారు. ఐతే ఈ ఫొటో నవ్వులు పూయిస్తున్నా.. చిన్నారులతో ఇవేమీ దరిద్రాలు అంటూ తల్లిదండ్రులపై ఫైర్ అయ్యేవాళ్లు ఉన్నారు.