IPL 2023: చూసుకుందాం రా! తేల్చుకుందాం రా! నేడు చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్
ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, డుప్లెసిస్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జట్లు మొదటిసారిగా ఈ సీజన్లో తలబడబోతున్నాయి. ఇరు జట్ల గెలుపు అవకాశాలు చరో యాభై శాతం అనుకోవచ్చు. ఈ రెండు జట్లు కూడా బెంగళూరు వేదికగా, సోమవారం మ్యాచ్ ఆడబోతున్నాయి.

IPL 2023: ఐపీఎల్-2023లో నేడు మహా సమరం జరగబోతుంది. రెండు భీకర జట్లు సమరానికి సై అంటున్నాయి. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, డుప్లెసిస్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జట్లు మొదటిసారిగా ఈ సీజన్లో తలబడబోతున్నాయి. ఇరు జట్ల గెలుపు అవకాశాలు చరో యాభై శాతం అనుకోవచ్చు.
ఈ రెండు జట్లు కూడా బెంగళూరు వేదికగా, సోమవారం మ్యాచ్ ఆడబోతున్నాయి. పాయింట్స్ టేబుల్‌ని గమనిస్తే చెన్నై ఈ సీజన్‍లో ఇప్పటివరకు 4 మ్యాచులు ఆడి, రెండింట గెలిచి, రెండింట ఓడింది. ఆర్సీబి కూడా 4 మ్యాచులు ఆడి, రెండింట గెలిచి, రెండింట ఓడింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండుజట్లు 30 మ్యాచుల్లో తలపడగా, అందులో చెన్నై 19 గెలిచింది. ఆర్సీబీ పదింట నెగ్గింది. ఆఖరిగా జరిగిన 4 మ్యాచుల్లో చెన్నై మూడింట గెలిచి, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. బలాబలాలకు సంబంధించి, ఈసారి అన్ని విభాగాల్లో కూడా చెన్నై కంటే, బెంగళూరు జట్టే పటిష్టంగా ఉంది.
సొంత గ్రౌండ్ లో చెన్నై వంటి జట్టు మీద విజయం సాధిస్తే, బెంగళూరు కాన్ఫిడెన్స్ మరింత పెరిగే అయ్యే ఛాన్స్ ఉంది. గాయాల బెడదలతో స్టార్ ఆటగాళ్లు దూరమైన చెన్నై జట్టుకు, బెంగళూరుకు ఎలాంటి సవాల్ విసరనుందో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియంలో, సిక్సర్ల మోత మోగిపోతుంది. ఇరు జట్లలో కూడా హార్డ్ హిట్టర్స్ ఉండడంతో, మ్యాచ్ ఫైనల్ ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగే ఛాన్స్ ఉంది.