హెలికాఫ్టర్ షాట్స్ కు రెడీనా ? ధోనీ 2.0 లోడ్ అయిందన్న రైనా

వరల్డ్ క్రికెట్ కు హెలికాఫ్టర్ షాట్ పరిచయం చేసింది ధోనీనే... ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు మహేంద్రుడి హెలికాఫ్టర్ షాట్ కోసమే ఎదురుచూస్తుంటారు.. ధోనీ ఆ షాడితే ఫ్యాన్స్ మైమరిచిపోతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2025 | 04:20 PMLast Updated on: Mar 21, 2025 | 4:20 PM

Ready For Helicopter Shots Dhoni 2 0 Is Loaded Says Raina

వరల్డ్ క్రికెట్ కు హెలికాఫ్టర్ షాట్ పరిచయం చేసింది ధోనీనే… ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు మహేంద్రుడి హెలికాఫ్టర్ షాట్ కోసమే ఎదురుచూస్తుంటారు.. ధోనీ ఆ షాడితే ఫ్యాన్స్ మైమరిచిపోతారు. ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్న మిస్టర్ కూల్.. మరోసారి తన సిగ్నేచర్ షాట్ ను బయటపెడుతున్నాడు. ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ గా భారత్ కు ఎన్నో విజయాలు అందించిన ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ లు అంత తేలిగ్గా మరిచిపోలేరు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్ కొనసాగుతున్న ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకంగా ఉన్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించిన తర్వాత ఆటగాడిగా ఉంటూ యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు.మెగా వేలానికి ముందే ధోనీని చెన్నై అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకోవడంతో అతని రిటైర్మెంట్ వార్తలకు కూడా ఎండ్ కార్డ్ పడింది. ఈ నేపథ్యంలో ధోనీ కొత్త సీజన్ కు రెడీ అవుతుండగా… అతని బ్యాటింగ్ పై మాజీ ఆటగాడు సురేశ్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు.

గత ఏడాది ధోని ఎన్నో సిక్సర్లు బాదాడనీ, ఈ సారి కూడా అతను చాలా బలంగా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించాడు. సీఎస్కే కు ఆడేందుకు ఎంతో పట్టుదలతో కనిపిస్తున్నాడని చెప్పాడు. టీమ్ ఆర్డర్ ఒకటి నుంచి ఆరు వరకు బలంగా ఉంది. ఈ ఏడాది కూడా ఫ్యాన్స్ తలా నుంచి హెలికాప్టర్ షాట్లు చూస్తారన్నాడు. ఇదిలా ఉంటే ఆట పట్ల ధోనీ కమిట్ మెంట్ ఎలా ఉంటుందన్న దానిపైనా రైనా స్పందించాడు. కమర్షియల్ యాడ్స్ చేస్తుంటే కోట్ల రూపాయాలు వస్తాయి. అది కూడా ధోని లాంటి లెజెండ్ అంటే కంపెనీలు ఎంతైనా ఆఫర్ చేస్తాయి. కానీ ధోని మాత్రం ఐపీఎల్ కోసం ఆ షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకునేవాడని రైనా చెప్పాడు.

తాను భారత్, సీఎస్కే తరఫున ఆడుతున్నప్పుడు ధోనీతో కలిసి షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని చెన్నై వెళ్లేవాళ్లమనీ గుర్తు చేసుకున్నాడు. రోజూ మూడు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లమనీ,. ప్రతి వారం నాలుగైదు రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్లనీ చెప్పుకొచ్చాడు.
ధోని గురించి ఒక సీక్రెట్ కూడా రైనా వెల్లడించాడు. అతని ఫిట్ నెస్, వికెట్ కీపింగ్ స్కిల్స్, కెప్టెన్సీ గురించి అందరూ మాట్లాడుకుంటారనీ, కానీ అతను తన బ్యాట్ ను లిఫ్ట్ చేసే సమయంలో ఎంతటి పవర్ వస్తుందో చాలా మంది గమనించలేదన్నాడు కేవలం ప్రాక్టీస్ తోనే అది సాధ్యమవుతుంది. ఐపీఎల్ లో సీఎస్కే ప్రాక్టీస్ కోసం నెల రోజుల ముందే ధోని చెన్నైకి వస్తాడనీ, కమర్షియల్ యాడ్స్ చేసే వీలున్నా ఎక్కువ టైమ్ ప్రాక్టీస్ కే కేటాయిస్తాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ధోని ఐపీఎల్ 2025 కోసం సిద్దమవుతున్నాడు. దీనిలో భాగంగా చెన్నైలో చెపాక్ స్టేడియంలో భారీ షాట్లు ఆడుతున్నాడు. గత ఇన్నింగ్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తో ఉర్రూతలూగించిన ధోనీ.. ఈ సీజన్ లో కూడా ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. 2024లో ధోని 11 ఇన్నింగ్స్ ల్లో 220.54 స్ట్రైక్ రేట్ తో 161 పరుగులు చేశాడు. ధనాధన్ షాట్లతో చెలరేగాడు. ఐపీఎల్ 2025లోనూ ధోని ఫినిషర్ పాత్ర పోషించే అవకాశం ఉంది.