రంజీ మ్యాచ్ కోసం రెడీ, బంగర్ దగ్గర కోహ్లీ ప్రాక్టీస్

టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ రంజీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జనవరి 30 నుంచి రైల్వేస్‌, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2025 | 12:32 PMLast Updated on: Jan 28, 2025 | 12:32 PM

Ready For Ranji Match Kohli Practices Near Bangar

టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ రంజీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జనవరి 30 నుంచి రైల్వేస్‌, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కోహ్లీ రాకతో ఈ మ్యాచ్ కు క్రేజ్ పెరిగింది. అటు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కోహ్లీ అభిమానుల కోసం బంపరాఫర్ కూడా ఇచ్చింది. 10 వేల మంది ఫ్యాన్స్ ను ఉచితంగా అనుమతించబోతోంది. 4 రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ లో అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చి ఉచితంగా విరాట్ కోహ్లీ ఆటను చూడొచ్చుని డీడీసీఏ వర్గాలు తెలిపాయి. విరాట్ 12 సంవత్సరాల క్రితం రంజీలో ఆడాడు. 2012/13 రంజీ ట్రోఫీలో కోహ్లీ పాల్గొన్నాడు. ఈ కాలంలో కోహ్లీ 1 సెంచరీ మరియు 2 అర్ధ సెంచరీలు సాధించాడు. కోహ్లి చివరిసారిగా 2010లో దేశవాళీ స్థాయిలో రెడ్ బాల్‌లో టెస్ట్ క్రికెట్ ఆడాడు. అక్కడ మొదటిసారి ఇరానీ కప్‌లో పాల్గొన్నాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున 3 మ్యాచ్‌లు ఆడాడు.

మరోవైపు పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న కోహ్లీ రంజీ మ్యాచ్ తో మళ్ళీ అదరగొడతాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడానికి టీమిండియా మాజీ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయం తీసుకున్నాడు. ముంబై శివారులో బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగతంగా నెలకొల్పిన సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విరాట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటపై నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోకస్ పెట్టాడు. 2014 నుంచి 2019 వరకు బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరుగుల వరద పారించాడు. బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రావడంతో కోహ్లీ ఆట గాడి తప్పింది. దీంతో మరోసారి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడానికి బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించాడు. రైజింగ్ డెలివరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా ఎదుర్కొవాలన్న దానిపై కోహ్లీకి బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పలు సూచనలు చేశాడు.

కోహ్లీ కొన్నేండ్ల నుంచి ఎక్కువ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటంతో బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆట మరుగున పడింది. దీంతో ఇప్పుడు దీనికి బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదును పెడుతున్నాడు. కోహ్లీ ఆటను పరిశీలిస్తే గత కొన్నేళ్లుగా తను స్క్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటం లేదు. ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రమే ఆడుతున్నాడు. దీంతో బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త స్ట్రోక్స్‌‌ ఆడేందుకు బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయం చేస్తున్నాడు. అలాగే ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతులను వెంటాడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. దీంతో ఈ వీక్ నెస్ నుంచి కూడా బయటపడేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు.