M.S.Dhoni: కృత్రిమ మేధలో కూడా కెప్టెన్ కూల్
సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది.

Recently when chatgpt was asked which is the all-time best team in T20 cricket, it showed MS Dhoni
ఓపెన్ ఏఐ సృష్టించిన ఈ కంప్యూటర్ అప్లికేషన్.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో ఎంత పెద్ద ప్రశ్నకైనా ఈజీగా సమాధానం చెప్పేస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్యం, రాజకీయాలు, ఫుడ్, లైఫ్‍స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానం చెబుతుంది. తాజాగా క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం ఇచ్చింది. అంతేకాదు ఓ దిగ్గజ క్రికెటర్ ఎంతలా ఆలోచించి ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టు ప్రకటిస్తాడో.. అంతకుమించిన టీమ్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా టీ20 క్రికెట్‌లో ఆల్‌టైమ్ బెస్ట్ జట్టు ఏది అని చాట్‌జీపీటీని అడిగితే.. సెకండ్ల వ్యవధిలో టీమ్‌ను ప్రకటించిందట. ఈ జట్టుకు ప్రపంచ అత్యుత్తమ సారథి ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. చాట్‌జీపీటీ తన ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంపిక చేసింది. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఐదో స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను ఎంచుకుంది. వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీని ఎంచుకున్న చాట్‌జీపీటీ.. ఆల్‌రౌండర్‌గా షాహిద్ అఫ్రిదిని తీసుకుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రషీద్ ఖాన్‌ను ఎంచుకున్న చాట్‌జీపీటీ.. పేస్ కోటాలో లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయిన్‌లను ఎంచుకుంది.