ముంబై జట్టులోకి ముజీబ్ ఘజన్‌ఫర్ కు రీప్లేస్ మెంట్
ఐపీఎల్ 2025 సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైన వేళ కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ళ గాయాల బెడద వెంటాడుతోంది. దీంతో ఆయా ఫ్రాంచైజీలు రీప్లేస్ మెంట్స్ పై ఫోకస్ పెట్టాయి. తాజాగా ముంబై ఇండియన్స్ ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ను జట్టులోకి తీసుకుంది.

ఐపీఎల్ 2025 సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైన వేళ కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ళ గాయాల బెడద వెంటాడుతోంది. దీంతో ఆయా ఫ్రాంచైజీలు రీప్లేస్ మెంట్స్ పై ఫోకస్ పెట్టాయి. తాజాగా ముంబై ఇండియన్స్ ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ను జట్టులోకి తీసుకుంది. గాయంతో సీజన్ కు దూరమైన ఘజన్‌ఫర్ స్థానాన్ని అప్ఘానిస్థాన్ కు చెందిన స్పిన్నర్ ముజీబ్ తో రీప్లేస్ చేసింది. ఐపీఎల్ మెగా వేలంలో ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. వెన్ను గాయంతో బాధపడుతున్న ఘజన్‌ఫర్.. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టు తరఫున ఇప్పటివరకు 10 వన్డేలు ఆడాడు. గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తుండడంతోనే ముంబై అతన్ని వేలంలోకి కొనుగోలు చేయగా.. దురదృష్టవశాత్తూ గాయపడి దూరమయ్యాడు. ఘజన్‌ఫర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ముంబయి ఇండియన్స్.. ముజీబ్ ను తమ జట్టులోకి ఆహ్వానించింది.
కాగా అతని రీప్లేస్ మెంట్ వచ్చిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. అతను 17ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ముజీబ్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్,సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ లో మొత్తం 19 మ్యాచులు ఆడి 19 వికెట్లు తీశాడు. 2018 సీజన్ లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన అతడిని మొదటగా పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అప్పుడు అతడు 11 మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ గాయం కారణంగా ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
అప్పుడు కేకేఆర్ లో అతడి స్థానాన్ని ఘజన్‌ఫరే రీప్లేస్ చేశాడు. అప్ఘానిస్థాన్ క్రికెట్ లో బంతితో ప్రభావం చూపిన యంగెస్ట్ క్రికెటర్స్ లో ముజీబ్ ఒకడు. మొత్తంగా టీ20 కెరీర్ లో 300 మ్యాచులు ఆడి 6.5 ఎకానమీతో 330 వికెట్లు తీశాడు. ముజీబ్‌కు టీ ట్వంటీల్లో అద్భుతమైన రికార్డుంది. పవర్‌ప్లేలో తన స్పిన్ తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టే సత్తా అతడికి ఉంది. అయితే పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ముజీబ్‌ను అఫ్గాన్ సెలక్టర్లు ఎంపిక చేయలేదు. కాగా ముజీబ్‌ను 2 కోట్ల కనీస ధరకు ముంబై ఒప్పందం కుదుర్చుకుంది.