రిటెన్షన్ రూల్స్ మరింత ఆలస్యం.. ఈ నెలాఖరులోగా ప్రకటించే ఛాన్స్
ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ నిబంధనలకు సంబంధించి ఫ్రాంచైజీల నిరీక్షణకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం రిటెన్షన్ రూల్స్ పై బీసీసీఐ ఇంకా నిర్ణయానికి రాలేదు.
ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ నిబంధనలకు సంబంధించి ఫ్రాంచైజీల నిరీక్షణకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం రిటెన్షన్ రూల్స్ పై బీసీసీఐ ఇంకా నిర్ణయానికి రాలేదు. ఫ్రాంచైజీలతో మీటింగ్ జరిగి నెలరోజులు దాటిపోయినా రిటెన్షన్ పాలసీపై బీసీసీఐ కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరులోగా రిటెన్షన్ నిబంధనలను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఫ్రాంచైజీలు చాలా విషయాల్లో వేర్వేరు అభిప్రాయాలు చెప్పడం బీసీసీఐ నిర్ణయాన్ని మరింత ఆలస్యం చేస్తోంది. రిటెన్షన్ ను ఆరుకు పెంచాలని కొన్ని, ఆర్టీఎమ్ రూల్ ను కావాలని కొన్ని , వద్దని మరికొన్ని ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసాయి.
దీంతో రిటెన్షన్ రూల్స్ తో మరికొన్ని ఐపీఎల్ నిబంధనలపైనా బోర్డు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఐదేళ్ళు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ఆటగాళ్ళను అన్ క్యాప్డ్ ప్లేయర్స్ గా పరిగణించే నిబంధనపైనా చర్చ జరుగుతోంది. అటు ఫ్రాంచైజీలకు, ఇటు లీగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా రూల్స్ డిసైడ్ చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. సెప్టెంబర్ 29న జరిగే బీసీసీఐ ఏజీఎం తర్వాత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఐపీఎల్ రూల్స్ ఏజీఎంలో చర్చించే అంశం కాకున్నా బీసీసీఐ వర్గాలు ఈ మీటింగ్ ముగిసాకే వీటిని కొలిక్కి తీసుకోచ్చే ఛాన్సుంది.