27 ఏళ్ళకే రిటైర్మెంట్ ,ఆసీస్ యువక్రికెటర్ షాకింగ్ నిర్ణయం

ఆస్ట్రేలియా టెస్టు ప్లేయ‌ర్ విల్ పుకోవిస్కీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. కంక‌ష‌న్ వ‌ల్ల అత‌ను రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2025 | 01:52 PMLast Updated on: Apr 08, 2025 | 1:52 PM

Retirement At The Age Of 27 A Shocking Decision By A Young Aussie Cricketer

ఆస్ట్రేలియా టెస్టు ప్లేయ‌ర్ విల్ పుకోవిస్కీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. కంక‌ష‌న్ వ‌ల్ల అత‌ను రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. క్రికెట్ నిపుణులు ఇచ్చిన స‌ల‌హా మేర‌కు అత‌ను డిసిష‌న్ తీసుకున్నాడు. ప‌లుమార్లు పుకోవిస్కీ త‌ల‌కు బంతి త‌గిలింది. దీంతో అత‌ను ప్ర‌తిసారి కంక‌ష‌న్‌కు లోన‌య్యాడు.

వాస్త‌వానికి విల్ పుకోవిస్కీ.. ఇండియాపై టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. 2021లో అత‌ను ఇండియా సిరీస్‌లో ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ కంక‌ష‌న్ ప‌రిస్థితులు త‌లెత్త‌డం వ‌ల్లే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఆ 27 ఏళ్ల బ్యాట‌ర్ చెప్పాడు.తాజాగా గ‌త ఏడాది మార్చిలో షీఫీల్డ్ షీల్డ్ టోర్నీలోనూ అత‌ని హెల్మెట్‌కు బంతి త‌గిలింది. అప్ప‌టి నుంచి అత‌ను క్రికెట్‌కు దూరం అయ్యాడు.మెల్‌బోర్న్ ప్రీమియ‌ర్ క్రికెట్ జ‌ట్టుకు హెడ్‌కోచ్‌గా చేయ‌నున్న‌ట్లు పుకోవిస్కీ చెప్పాడు.