Rinku Singh: రింకూ కోసం 6 లక్షలు.. అమితాబ్ షోలో అదిరే ప్రశ్న
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ‘ఘూమర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ కేబీసీలో పాల్గొంది. అభిషేక్ బచ్చన్, సయామీ ఖెర్‌తోపాటు, చిత్ర డైరెక్టర్ ఈ షోకు వచ్చారు. ‘ఘూమర్’ చిత్ర యూనిట్‌కు హోస్ట్ అమితాబ్ బచ్చన్ ఓ ప్రశ్న సంధించారు.
Rinku Singh: ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టేసిన రింకు ఐర్లాండ్ సిరీస్‌తోపాటు ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన జట్టులోనూ స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో ఓ ప్రశ్న రూపంలో రింకు సింగ్ వచ్చేశాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ‘ఘూమర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ కేబీసీలో పాల్గొంది. అభిషేక్ బచ్చన్, సయామీ ఖెర్‌తోపాటు, చిత్ర డైరెక్టర్ ఈ షోకు వచ్చారు. ‘ఘూమర్’ చిత్ర యూనిట్‌కు హోస్ట్ అమితాబ్ బచ్చన్ ఓ ప్రశ్న సంధించారు.
ఆ ప్రశ్నకు కరెక్ట్‌గా సమాధానం చెబితే ఆరు లక్షల నలభై వేలను గెలుచుకొనే అవకాశం ఉంటుంది. ‘‘ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన ఏ ఆటగాడు వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టాడు?’’ అనే ప్రశ్నకు ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్.. నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. మరి ఆ చిత్ర యూనిట్ సమాధానం కరెక్టుగా చెప్పిందో లేదో తెలియాలంటే మాత్రం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు కెబిసీ నిర్వాహకులు.