యూపీ టీ20 లీగ్ రింకూసింగ్ ధనాధన్
యువక్రికెటర్ రింకూ సింగ్ దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. యూపీ టీ ట్వంటీ లీగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

యువక్రికెటర్ రింకూ సింగ్ దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. యూపీ టీ ట్వంటీ లీగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తనదైన మెరుపు ఇన్నింగ్స్ లతో మీరట్ మెవెరిక్స్‌కు విజయాలను అందిస్తున్నాడు. మీరట్ టీమ్ కు సారథిగా ఉన్న రింకూ తాజాగా నోయిడా సూపర్ కింగ్స్‌పై కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసాడు. బ్యాట్‌తో అదరగొట్టిన రింకూ సింగ్ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 2 వికెట్లు పడగొట్టి ఆల్ రౌండ్ షోతో మెరిశాడు. కాగా మెవెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఛేజింగ్ లో నోయిడా.. 152 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు మ్యాచ్ లోనూ రింకూ 48 రన్స్ తో మెరుపులు మెరిపించాడు.