Rinku Singh: ఈ రోజుతో విరాట్ రికార్డు బ్రేక్.. టీ20ల్లో రింకూ కొత్త చరిత్ర..

తనదైన ఫినిషింగ్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తలపిస్తున్నాడు రింకూ. యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్.. ఇప్పటి వరకూ ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్‌కు దిగే అవకాశం వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2023 | 05:03 PMLast Updated on: Nov 28, 2023 | 5:03 PM

Rinku Singh Surpass Star Player Virat Kohlis T20 Record

Rinku Singh: టీమిండియా యువ ఫినిషర్ రింకూ సింగ్‌ను అరుదైన ఘనత ఊరిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన రింకూ సింగ్.. భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వైజాగ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆఖరి బంతికి సిక్స్ బాది చిరస్మరణీయ విజయాన్ని అందించిన రింకూ సింగ్.. రెండో టీ20లో 9 బంతుల్లోనే 31 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. తనదైన ఫినిషింగ్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తలపిస్తున్నాడు రింకూ. యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్.. ఇప్పటి వరకూ ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

VIRAT KOHLI: ఆర్సీబీని వదిలేయాలనుకున్న విరాట్.. ఎందుకో తెలుసా..?

అందులో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్‌కు దిగే అవకాశం వచ్చింది. మూడు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన రింకూ సింగ్ ఇప్పటివరకూ 128 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 38 పరుగులు. అయితే ఆడింది నాలుగు ఇన్నింగ్సులే అయినప్పటికీ రింకూ సింగ్.. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 344.44 స్ట్రైక్ రేట్‌తో రింకూ సింగ్ బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ ద్వారానే రింకూసింగ్.. విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్లో.. 19, 20 ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా రింకూ సింగ్ చరిత్రకెక్కాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. టీ20 క్రికెట్లో రింకూ సింగ్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ ఫీట్ చెరో రెండుసార్లు సాధించారు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో మరోసారి చివరి రెండు ఓవర్లలో రింకూ సింగ్ చెలరేగితే అత్యధిక సార్లు చివరి రెండు ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీని అధిగమిస్తాడు.

మరోవైపు.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఆడిన ఇన్నింగ్స్ ద్వారానే రింకూసింగ్ మరో అరుదైన ఘనతను సైతం అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక మ్యాచ్‌లో.. 25కు పైగా పరుగులు చేసిన సందర్భంలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా కూడా రింకూ సింగ్ నిలిచాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదడం ద్వారా యూవీ ఈ ఫీట్ సాధించగా.. నిదహాస్ ట్రోఫీలో దినేశ్ కార్తీక్ ఒకే ఓవర్‌లో 29 పరుగులు పిండుకున్నాడు.