IPL FINAL FIGHT : రైజర్స్ vs రైడర్స్ ఐపీఎల్ కప్పు పట్టేదెవరు ?

ఐపీఎల్‌ ఫైనల్‌ ఫైట్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు భీకర ఫామ్‌లో ఉన్న కోల్‌కతా, మరోవైపు సంచలన విజయాలతో ఫైనల్ చేరిన హైదరాబాద్‌ మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 26, 2024 | 10:18 AMLast Updated on: May 26, 2024 | 10:18 AM

Risers Vs Raiders Who Will Win The Ipl Cup

ఐపీఎల్‌ ఫైనల్‌ ఫైట్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు భీకర ఫామ్‌లో ఉన్న కోల్‌కతా, మరోవైపు సంచలన విజయాలతో ఫైనల్ చేరిన హైదరాబాద్‌ మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జోరు కొనసాగిస్తుందా..? సన్‌రైజర్స్ దుమ్మురేపుతుందా అన్నది ఆసక్తి రేపుతోంది.

ఐపీఎల్‌ 17వ సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్‌ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. ఒకే ఒక్క అడుగు.. అరవై రోజుల పోరాటంలో అంతిమ విజేత ఎవరో తేల్చనుంది. ఆఖరి పోరాటంలో సన్‌రైజర్స్‌ ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలిస్తుందా.. లేక కోల్‌కతా జోరు కొనసాగుతుందా అన్నది మరి కొన్నిగంటల్లోనే తేలిపోనుంది. టైటిల్ విజేత ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇప్పటివరకు ఈ రెండు టీమ్ లు 27 మ్యాచ్‌లు ఆడగా.. 18 సార్లు కోల్‌కతా… 9 సార్లు సన్‌రైజర్స్ విజయం సాదించాయి. బలాబలాల పరంగా చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కోల్‌కతా టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఓ వైపు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూనే.. క్లాస్ ప్లేతో ఆ టీమ్‌ ఎదురులేకుండా ఫైనల్‌ దాకా వెళ్లింది. ఇటు హైదరాబాద్‌ జట్టును చూస్తే ఈ సీజన్‌లో రికార్డుల మోత మోగించిన జట్టు.. హెడ్‌ షేక్‌గా పిలుచుకునే ఓపెనర్లు సన్‌రైజర్స్ బలం. ఆరంభంలో ఈ ఇద్దరిపైనా ఆధారపడిన జట్టు… ప్లే ఆఫ్స్‌కు వచ్చేసరికి బ్యాటింగ్‌లో బలంగా మారింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ ఫెయిల్ అయినా నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, క్లాసిన్ ఫామ్‌లోకి వచ్చారు. బౌలింగ్‌లోనూ కాస్త డల్‌గా ఉన్న సన్‌రైజర్స్‌ క్వాలిఫైయర్ 2తో తమ బౌలింగ్ సత్తాను చాటింది. చెన్నైలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లో తేలిపోయినట్టే అనుకున్న టైమ్ లో ఆ జట్టు అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. రెండు జట్లు బలాబలాలపరంగా సమ ఉజ్జీలుగానే ఉన్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు ఇవాళ్టి మ్యాచ్‌కు వానగండం పొంచి ఉందని వాతావరణశాఖ చెబుతోంది. వర్షం కారణంగా రెండు జట్లు ప్రాక్టీస్‌కు దూరమయ్యాయి. ఇప్పటికే ఓ రేంజ్‌లో వర్షం దంచి కొడుతుండటంతో.. ఫైనల్ మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే డౌట్ ఉంది.

KKR, SRH రెండు జట్లు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లెవరు…? రెండు జట్ల బలా బలాలు పరిశీలిస్తే… సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు బలం… ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ… బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు వీరి విధ్వంసం వల్ల… ఐపీఎల్ చరిత్రలోనే భారీస్కోర్లు నమోదవుతున్నాయి. మొదట వీళ్ళిద్దరిపైనే ఆధారపడిన సన్‌రైజర్స్ కు.. ఇప్పుడు మిడిలార్డర్‌లో నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, క్లాసిన్ ఫామ్‌లోకి రావడం అదనపు బలంగా మారింది. ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. కమిన్స్ వీరకుమ్ముడు కుమ్ముతున్నాడు. కమిన్స్ కు తోడు భువీ.. స్వింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. ఇక యార్కర్స్, స్లో బాల్స్, షార్ట్‌ పిచ్‌ బంతులతో చెలరేగేందుకు నటరాజన్ సిద్ధంగా ఉన్నాడు. అయితే స్పిన్ లో మాత్రం సన్‌రైజర్స్ కాస్త వీక్‌గా ఉందని చెప్పొచ్చు.

కోల్‌కతా నైట్ రైడర్స్.. చాంపియన్‌ ఆటతీరు కనబరుస్తోంది. ఈ జట్టుకు నరైన్ అద్భుత బ్యాటింగ్‌ వరంగా మారింది. ఆరంభంలో నరైన్ దుమ్మురేపుతున్నాడు. మధ్యలో అయ్యర్ స్క్వేర్ వీరవిహారం చేస్తున్నారు. బౌలింగ్ విషయానికొస్తే, కన్సిస్టెంట్‌గా వికెట్లు తీసే ప్రపంచ స్థాయి బౌలర్లుండటం… కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. మిచెల్ స్టార్క్ ఫామ్‌లోకి రావడంతో ఆ జట్టు బౌలింగ్ విభాగం కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఐపీఎల్ 2024లో టాప్ 15 బౌలర్లలో కేకేఆర్ నుంచి నలుగురు బౌలర్లు ఉన్నారు. ఇక స్పిన్నర్ల విభాగంలోనూ వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్‌తో కూడిన కోల్‌కతా బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైంది.