నిచ్చెన వేసుకుని తీశారు, పంత్ తో అట్లుంటది
సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లు బౌన్సర్లతో గాయపరిచినా నిలకడగా ఆడి 40 రన్స్ చేశాడు.
సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లు బౌన్సర్లతో గాయపరిచినా నిలకడగా ఆడి 40 రన్స్ చేశాడు. ఈ క్రమంలో పంత్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. అతను కొట్టిన పవర్ షాట్‌కు.. బంతి ఏకంగా సైడ్‌స్క్రీన్‌పై చిక్కుకుపోయింది. బ్యూ వెబ్‌స్టర్ వేసిన 46వ ఓవర్‌లో .. పంత్ తన పవర్ స్ట్రోక్‌తో అలరించాడు. లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. బంతి సైట్ స్క్రీన్‌పై చిక్కుకోవడాన్ని దాన్ని తీసేందుకు గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగింది. నిచ్చెన వేసుకుని మరీ ఆ బంతిని తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పంత్ తో అట్లుంటది మరి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.