Rishabh Pant: రిషబ్ బ్రో.. రెస్ట్ చాలు.. కుర్రాళ్ళు ఇరగదీస్తున్నారు..!
త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే చిన్నపాటి కసరత్తులు, నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్ పంత్.. చాలా రోజుల తర్వాత ఒక మ్యాచ్ ఆడాడు. మునుపటిలా భారీ షాట్లతో రిషభ్ పంత్ విరుచుకుపడ్డాడు.

Rishabh Pant: గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అనంతరం అతడి కుడికాలికి శస్త్ర చికిత్సలు కూడా జరిగాయి. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే చిన్నపాటి కసరత్తులు, నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్ పంత్.. చాలా రోజుల తర్వాత ఒక మ్యాచ్ ఆడాడు. దాదాపు 8 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన రిషభ్ పంత్ తన కమ్ బ్యాక్ త్వరలోనే ఉంటుందనే హిట్ ఇచ్చాడు.
స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ నిర్వహించిన ఒక ఫౌండేషన్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆడాడు. మునుపటిలా భారీ షాట్లతో రిషభ్ పంత్ విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. బౌలర్ వేసిన ఒక బంతిని ఇంచు కూడా కదలకుండా ఫ్లిక్ షాట్‌తో ఎక్స్ ట్రా కవర్స్ మీదుగా రిషభ్ పంత్ భారీ సిక్సర్ బాదాడు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆసియా కప్ 2023 ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది.
అనంతరం వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. దొరక్క దొరక్క దొరికిన అవకాశాల్ని యంగ్ ప్లేయర్స్ అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ ఇంకా కష్టపడాలి అంటూ, టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో పంత్‌కు కామెంట్స్ పెడుతున్నారు.