Rishabh Pant: రీ ఎంట్రీకి రిషబ్ పంత్ రెడీ.. కానీ ఆ రోల్‌కు దూరం

పంత్‌ ప్రస్తుత పరిస్థితి చూస్తే యాక్సిడెంట్‌ తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. ఇదే కొనసాగితే ఐపీఎల్‌ 17వ సీజన్ తో పంత్‌ రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పేందుకు రెడీగా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2024 | 06:37 PMLast Updated on: Feb 20, 2024 | 6:37 PM

Rishabh Pant Set For Return To Ipl 2024 As Pure Batter And Captain

Rishabh Pant: ఏడాది క్రితం కారు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరు ఆలుర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన వార్మప్‌ గేమ్‌లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ చాలా యాక్టివ్‌గా కనిపించాడు. యాక్సిడెంట్‌కు ముందులా కాకపోయినా మైదానంలో చురుగ్గా కలియదిరిగాడు. పంత్‌ ప్రస్తుత పరిస్థితి చూస్తే యాక్సిడెంట్‌ తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది.

IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌పై బిగ్ అప్‌డేట్.. సీజన్ ఆరంభ తేదీ ఎప్పుడో తెలుసా..?

ఇదే కొనసాగితే ఐపీఎల్‌ 17వ సీజన్ తో పంత్‌ రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పేందుకు రెడీగా ఉంది. అయితే పంత్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని తెలుస్తుంది. పంత్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డీసీ యాజమాన్యం అతన్ని వికెట్‌కీపింగ్‌కు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పంత్‌ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఎన్‌సీఏ నుండి క్లియరెన్స్ పొందిన తర్వాతే పంత్‌ ఐపీఎల్‌లో ఆడేందుకు లైన్‌ క్లియర్‌ అవుతుంది. పంత్ గైర్హాజరీలో గత ఐపీఎల్ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు.