Rishabh Pant: ఏరా ఎలా ఉన్నావ్.. బాగున్నా భయ్యా, విండీస్ ఎప్పుడు వెళ్తున్నారు..
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు.

Rishabh Pant was met by KL Rahul, Shardul Thakur, Yajuvendra Chahal and Mohammad Siraj at the National Cricket Academy
భారత్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే దిశగా పంత్ శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఏన్సీఏలో శిక్షణ పొందుతున్న తన సహచర ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్‌ను పంత్ కలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను పంత్ సోషల్ మీడియాలో షేర్‌చేశాడు.
మా గ్యాంగ్‌తో రీయూనియన్ కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ పంత్ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా జోడించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక భారత స్టార్ ఆటగాడు కెఎల్ రాహల్ కూడా గత కొన్ని రోజుల నుంచి ఏన్సీఏలోనే ఉన్నాడు. తన మోకాలి సర్జరీ తర్వాత రాహుల్ ఏన్సీఏలో చేరాడు. ఆసియాకప్‌కు తిరిగి జట్టులో చేరేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నాడు.