రోహిత్ ఇక కష్టమే, రంజీ రీఎంట్రీలో ఫెయిల్

రెడ్ బాల్ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది టెస్టుల్లో కొనసాగుతాడని చాలా మంది భావించినా... అది జరిగేలా కనిపించడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2025 | 12:41 PMLast Updated on: Jan 25, 2025 | 12:41 PM

Rohit Faces Tough Times Fails In Ranji Re Entry

రెడ్ బాల్ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది టెస్టుల్లో కొనసాగుతాడని చాలా మంది భావించినా… అది జరిగేలా కనిపించడం లేదు. ఫామ్ కోసం హిట్ మ్యాన్ నానా తంటాలు పడుతున్నాడు. ఆసీస్ టూర్ లో అట్టర్ ఫ్లాప్ అయిన రోహిత్ తాజాగా రంజీ రీఎంట్రీలోనూ నిరాశపరిచాడు. జమ్మూ కాశ్మీర్ తో మ్యాచ్ లో పేలవ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులకే ఔటైనా భారత కెప్టెన్ రెండో ఇన్నింగ్స్ లో 28 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగ్గా కనిపించిన రోహిత్..2 బౌండరీలతో పాటు 3 భారీ సిక్స్‌లు బాది ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. దీంతోముంబైలోని బీకేసీ గ్రౌండ్ లో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముంబై కా రాజా రోహిత్ శర్మ అనే నినాదాలు మిన్నంటాయి. కానీ వాళ్ల ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఈసారి కూడా రోహిత్ 28 పరుగుల దగ్గరే తన వికెట్ పారేసుకున్నాడు. నాలుగో ఓవర్లోనే ఓసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. తర్వాత మూడు సిక్స్ లతో విరుచుకుపడ్డాడు.

11 బంతుల్లోనే 21 రన్స్ చేసిన తర్వాత మరోసారి నెమ్మదించి తర్వాతి 20 బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేశాడు. చివరికి 35 బంతుల్లో 28 రన్స్ చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో ఉమర్ నజీర్ కు వికెట్ ఇచ్చిన రోహిత్.. ఈసారి యుధ్‌వీర్ సింగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అతని బౌలింగ్ లో అంతకుముందే లాఫ్టెడ్ షాట్ తో సిక్స్ కొట్టిన రోహిత్.. మళ్లీ అలాంటి షాటే ఆడబోయి ఇన్‌సైడ్ ఎడ్జ్ కావడంతో మిడ్ వికెట్ లో ఉన్న అబిద్ ముస్తాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ ఉసూరుమన్నారు.

అయితే యుధ్వీర్ సింగ్, అకీబ్ నబీ కట్టడిగా బౌలింగ్‌ చేసి రోహిత్‌ను చికాకు పెట్టారు. దాంతో సహనం కోల్పోయిన రోహిత్ డిఫెన్స్ చేయబోయి వికెట్ పారేసుకున్నాడు. 38 బంతుల్లో 28 పరుగులు చేసి యుధ్వీర్ సింగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌ అయ్యాడు.
భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా బిగ్ షాట్స్‌తో కాసేపు పాత హిట్‌మ్యాన్ అలా వచ్చి వెళ్లాడు. అతడు గనుక మరో ఆరేడు ఓవర్లు ఆడి ఉంటే ఈజీగా ఇంకో 30 నుంచి 40 పరుగులు వచ్చేవి. పూర్తి ఫామ్‌ను అందుకోకపోయినా ఉన్న కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు భారత సారథి. అతడు ఇదే రీతిలో ఆడుతూ ఫుల్ టచ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ముంబై కీలక బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఓపెనర్ జైశ్వాల్ తో పాటు కెప్టెన్ రహానే , శ్రేయస్ అయ్యర్ , శివమ్ దూబె మళ్లీ చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో ముంబై 120 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో శార్థూల్ ఠాకూర్ అసాధారణ సెంచరీతో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. శార్థూల్ రాణించకుంటే ముంబై కథ ముగిసిపోయేది. శార్థూల్ , తనూష్ కొటియాన్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పాడు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి ముంబై రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 188 పరుగుల లీగ్ లో కొనసాగుతోంది.