రోహిత్ కు బీసీసీఐ షాక్ టెస్టులకు కొత్త కెప్టెన్ ఫిక్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతోంది. రిటైర్మెంట్ నిర్ణయంపై హిట్ మ్యాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా భారత టెస్ట్ జట్టుకు బీసీసీఐ కొత్త కెప్టెన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతోంది. రిటైర్మెంట్ నిర్ణయంపై హిట్ మ్యాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా భారత టెస్ట్ జట్టుకు బీసీసీఐ కొత్త కెప్టెన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రోహిత్ టెస్ట్ కెరీర్ దాదాపు ముగిసినట్టేనని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా టెస్ట్ పగ్గాలను జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించడం ఖాయమైంది. దీంతో ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇక టెస్టుల్లోనూ కనబడడు. అందుకే బుమ్రా ఫిట్ గానే ఉన్నా ముందు జాగ్రత్త కోసం ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని పీటీఐ పేర్కొంది.రోహిత్ ను ఇకపై టెస్టుల్లో ఆడించొద్దని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2024లో రోహిత్ టెస్టుల్లో చెత్త ప్రదర్శనతో నిరాశపరిచాడు. కేవలం 25 కంటే తక్కువ సగటే నమోదు చేశాడు. తన చివరి ఎనిమిది టెస్టుల్లో 10.9 సగటుతో 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతే కాకుండా రోహిత్ కెప్టెన్ గా ఉన్న గత ఆరు టెస్టుల్లో భారత్ ఓడిపోయింది.
నిజానికి టెస్టుల్లో హిట్ మ్యాన్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. గత ఏడాదికాలంగా రెడ్ బాల్ క్రికెట్ లో రోహిత్ బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ ఫ్లాప్ అయ్యాడు. తీవ్ర ఒత్తిడిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అందుకే సిడ్నీ టెస్టుకు ముందే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా సన్నిహితుల సలహాతో వెనక్కి తగ్గాడు. కానీ ఈ మ్యాచ్ తుది జట్టు నుంచి తనంతట తానుగానే తప్పుకుని ఆశ్చర్యపరిచాడు. బహుశా ఇదే అతని చివరి సిరీస్ కానుందన్నవార్తలువినిపిస్తున్నాయి. బ్యాటర్ గా, కెప్టెన్ గా రోహిత్ టెస్టుల్లో ఇటీవలి ప్రదర్శన పేలవంగా ఉండటంతో అతనిపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైందని పీటీఐ తెలిపింది. ఇప్పటికే రోహిత్ తో ఈ మేరకు బీసీసీఐ చర్చలు జరిపిందని కూడా వెల్లడించింది. ఏప్రిల్ నాటికి రోహిత్ కు 38 ఏళ్లు. తర్వాతి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ వచ్చేసరికి 40 ఏళ్లు వస్తాయి. దీంతో టెస్టుల్లో నూ రోహిత్ కెరీర్ ఇక ముగిసినట్లే.
రోహిత్ ఇక టెస్టులకు దూరమయ్యే నేపథ్యంలో తర్వాతి కెప్టెన్ గా బుమ్రాను బోర్డు ప్రకటించనుంది. ఇప్పటికే టెస్టుల్లో బుమ్రా వైస్ కెప్టెన్. మూడు టెస్టుల్లోనూ జట్టును నడపించాడు. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో సారథిగా బుమ్రా ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ప్రస్తుతం బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా భవిష్యత్ పై ఫోకస్ పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని తెలిసింది. బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో బౌలింగ్ ప్రారంభించలేదు. అతణ్ని కాపాడుకోవాల్సిన అవసరం భారత జట్టుకు ఉంది. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించే రిస్క్ తీసుకోలేదు. ఐపీఎల్ తో బుమ్రా రిథమ్ అందుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్-జులైలో ఇంగ్లండ్ టూర్ లో టెస్టు సిరీస్ కు బుమ్రా పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది. అదే జరిగితే ఆటగాడి కూడా రోహిత్ ను మళ్ళీ టెస్టుల్లో చూసే అవకాశాలు లేనట్టే.