Rohit Sharma: మూడో రోజు గ్రౌండ్‌లో కనబడని రోహిత్.. కారణం ఇదే..!
ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించాడు. దీంతో రోహిత్ ఎక్కడా అంటూ అందరూ చర్చించుకున్నారు.
Rohit Sharma: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసి సిరీస్‌ను 4-1తో గెలిచింది.
IND VS ENG: ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం..
ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించాడు. దీంతో రోహిత్ ఎక్కడా అంటూ అందరూ చర్చించుకున్నారు. అయితే దీనికి గల కారణాన్ని భారత బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో మైదానంలో దిగలేదని తెలిపింది. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం సెలబ్రేషన్స్ సమయంలో రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చాడు. జట్టును అభినందిస్తూ సంతోషం పంచుకున్నాడు. కాగా నొప్పి తీవ్రతరమైతే హిట్‌మ్యాన్ కొన్ని రోజులపాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాగా ధర్మశాల టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండానే.. యువ జట్టుతో రోహిత్ శర్మ ఇంగ్లండ్‌పై సీరీస్ విజయాన్ని అందించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడా.. లేదా.. అనేది తేలాలి.