Rohit Sharma: రోహిత్ రచ్చ షురూ.. క్రిస్ గేల్ పేరు మాయం
హిట్ మ్యాన్ 20, 30 పరుగులు చేసినా వాటిలో కనీసం ఒకటి రెండు సిక్సులు ఉంటాయంటే అతనికి సిక్సులు బాదేయడం ఎంత ఈజీనో మనం అర్ధం చేసుకోవచ్చు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో సిక్సులు కొట్టిన రోహిత్.. తాజాగా క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధం అయిపోయాడు.

Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో కాదు బౌండరీలు బాదడంలో రోహిత్ ముందే ఉంటాడు. ఇక సిక్సులు విషయంలో తనకు తానే సాటి. ఫార్మాట్ ఏదైనా రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే సిక్సుల వర్షం కురవాల్సిందే. హిట్ మ్యాన్ 20, 30 పరుగులు చేసినా వాటిలో కనీసం ఒకటి రెండు సిక్సులు ఉంటాయంటే అతనికి సిక్సులు బాదేయడం ఎంత ఈజీనో మనం అర్ధం చేసుకోవచ్చు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో సిక్సులు కొట్టిన రోహిత్.. తాజాగా క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధం అయిపోయాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలుపుకొని అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ టాప్‌లో ఉన్నాడు. గేల్ 551 ఇన్నింగ్స్ లో 553 సిక్సులు కొట్టేసాడు. ఇక మన హిట్ మ్యాన్ కేవలం 467 మ్యాచులోనే 539 సిక్సులు కొట్టి గేల్‌కి సమీపంలో ఉన్నాడు. మరో 15 సిక్సులు కొడితే గేల్ ఆల్ టైం రికార్డ్ తుడిచి పెట్టుకుపోతుంది. రోహిత్ తర్వాత, ఈ లిస్టులో ఉన్న ఏడుగురు క్రికెటర్స్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినవారే కావడం విశేషం. ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతున్న గేల్ కూడా క్రికెట్‌కి వీడ్కోలు చెప్పేసాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ రికార్డ్ హిట్ మ్యాన్ పేరు మీదే ఎక్కువకాలం కొనసాగే అవకాశం ఉంది.