Rohit Sharma: రోహిత్ శర్మ కొత్త మంత్రంతో ప్రత్యర్థులకు చుక్కలు.. ఇండియా వరుస గెలుపులకు కారణం ఇదే..!
రోహిత్ శర్మ క్రికెట్‌లో యునిక్ ప్లేయర్. కొంతమంది సచిన్ అని.. మరికొంతమంది సెహ్వాగ్ అని అంటుంటారు కానీ.. అతను డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ సచిన్ ప్లస్ సెహ్వాగ్. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలోనూ ఘన విజయం సాధించింది.
Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్‌గానే కాదు బ్యాటర్‌గానూ సూపర్ డూపర్ హిట్. వరుస పెట్టి రెండు మ్యాచ్‌ల్లో మంచినీళ్లు తాగినంత ఈజీగా మ్యాచ్‌లను గెలిపించాడు. రోహిత్ శర్మ క్రికెట్‌లో యునిక్ ప్లేయర్. కొంతమంది సచిన్ అని.. మరికొంతమంది సెహ్వాగ్ అని అంటుంటారు కానీ.. అతను డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ సచిన్ ప్లస్ సెహ్వాగ్. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలోనూ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు. ఇంకా ఎప్పటిలాగే విమర్శకులు పనిగట్టుకుని నోటికి పని చెప్పారు.
అయితే అఫ్ఘాన్, పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ రఫ్పాడించాడు. ఆట మొదలైన మొదటి రెండు ఓవర్లలోనే ప్రత్యర్థులకు తమ ఓటమి ఫిక్స్ ఐనట్టేనని అనిపించేలా వారి కాన్ఫిడెన్స్‌పై దెబ్బకొట్టాడు. ఆడితే బాది పడేయాలి. లేకపోతే బాల్స్ తినకుండా అవుట్ అవ్వాలి. ఇదే రోహిత్ స్ట్రాటజీ. ఆస్ట్రేలియాపై స్టార్టింగ్‌లోనే అవుట్ అయ్యాడు. అఫ్ఘాన్, పాక్‌పై మొదటి నుంచే బాదడం మొదలుపెట్టాడు. కొడితే సిక్స్ మాత్రమే కొట్టాలి అన్న లెవల్‌లో రోహిత్ ఊచకోత కొనసాగింది. అఫ్ఘాన్‌పై కేవలం 63 బంతుల్లోనే సెంచరీ బాదిన రోహిత్ క్రికెట్‌లో మరెవరికీ సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ కొట్టినన్ని సిక్సులు ఇంకెవరూ కొట్టలేదు. వన్డేల్లో 300కు పైగా సిక్సులు కొట్టాడు. గత 18 ఇన్నింగ్స్‌లలో 47 సిక్సులు కొట్టాడు. ఈ ఏడాది ఇప్పటికే 60 సిక్సులు బాదాడు.
ఇప్పటివరకు నాలుగు క్యాలెండర్ ఇయర్స్‌లో 60కి పైగా సిక్సులు బాదాడు రోహిత్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం ఏ ప్లేయర్ కూడా కనీసం రెండు క్యాలెండర్ ఇయర్స్‌లో 60 సిక్సులు కొట్టలేదు. వరల్డ్‌కప్ టోర్నీలో మేటి ఆటగాడు సచిన్. కానీ సచిన్ రికార్డులు ఇప్పుడు కనుమరుగైపోయేలా చేస్తున్నాడు రోహిత్. ఇప్పటికే వరల్డ్‌కప్‌లో సచిన్ సెంచరీల రికార్డును బద్దలుకొట్టాడు. సచిన్ యావరేజ్‌ని బీట్ చేశాడు. 2019 వరల్డ్‌కప్‌లోనూ రోహిత్ వరుసగా ఐదు సెంచరీలు చేశాడు. అయితే అప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ ఫార్ములాతో ఆడితే ఈ సారి మాత్రం దంచికొట్టుడు సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. పాకిస్థాన్ చేసిన 192 పరుగులు తక్కువే కావొచ్చు. కానీ ఆ జట్టులో టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. అటో ఇటో అయితే ఇండియా ఓడిపోవచ్చు కూడా.
కానీ తొలి ఓవర్ నుంచే హిట్టింగ్ మొదలు పెట్టిన రోహిత్ వారి కాన్ఫిడెన్స్‌పై దెబ్బకొట్టాడు. 2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సచిన్ ఇదే చేశాడు. కానీ ఆ ఒక్క మ్యాచ్‌లోనే ఈ ఫార్ములా యూజ్ చేశాడు. ఇప్పుడు రోహిత్ మాత్రం టోర్నీ మొత్తం ఇలానే ఆడాలని బలంగా డిసైడైనట్లు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. రోహిత్ ఇలానే ఆడితే టీమిండియా వరల్డ్‌కప్ గెలవడం ఏ మాత్రం కష్టం కాదు.