Rohit Sharma: మొన్న అజారుద్దీన్.. నిన్న ధోని.. నేడు రోహిత్..

భారత్‌కు రెండు ఆసియా కప్ టైటిల్స్ అందించిన రోహిత్.. తన కంటే ముందు ఈ ఘనతను సాధించిన మహ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని రికార్డులను సమం చేశాడు. హైదరాబాద్‌కి చెందిన మహ్మద్ అజారుద్దీన్ 1991, 1995 ఆసియా కప్ టోర్నీల్లో భారత్‌కు టైటిల్స్ అందించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2023 | 03:46 PMLast Updated on: Sep 18, 2023 | 3:46 PM

Rohit Sharma Joins Elite List Of Ms Dhoni Mohammad Azharuddin With Asia Cup

Rohit Sharma: భారత్, శ్రీలంక మధ్య ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా 8వసారి ఆసియా కప్ టైటిల్ గెలుచుకోగా.. రోహిత్ శర్మకు ఇది కెప్టెన్‌గా రెండో ఆసియా కప్ విజయం. ఇలా భారత్‌కు రెండు ఆసియా కప్ టైటిల్స్ అందించిన రోహిత్.. తన కంటే ముందు ఈ ఘనతను సాధించిన మహ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని రికార్డులను సమం చేశాడు. హైదరాబాద్‌కి చెందిన మహ్మద్ అజారుద్దీన్ 1991, 1995 ఆసియా కప్ టోర్నీల్లో భారత్‌కు టైటిల్స్ అందించాడు.

తద్వారా భారత్ తరఫున రెండు ఆసియా కప్ టైటిల్స్ గెలుచుకున్న తొలి టీమిండియా కెప్టెన్‌గా కూడా రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాత 2010, 2016 టోర్నీల్లో ఆసియా కప్ టైటిల్స్ గెలిచిన ఎంఎస్ ధోని.. రెండు టైటిల్స్ గెలిచిన భారత కెప్టెన్‌గా అజారుద్దీన్ రికార్డ్‌ను సమం చేశాడు. అలాగే ఈ ఘనత సాధించిన రెండో భారత సారథిగా నిలిచాడు. 2018 ఆసియా కప్ టోర్నీలో టీమిండియాకు టైటిల్ అందించిన రోహిత్ శర్మ.. తాజాగా 2023 టైటిల్‌ని గెలుచుకున్నాడు. తద్వారా రెండు టైటిల్స్ గెలిచిన భారత కెప్టెన్‌గా అజారుద్దీన్, ధోని రికార్డ్‌లను రోహిత్ శర్మ సమం చేశాడు. ఇంకా ఈ ఘనత సాధించిన మూడో కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు.