Rohit Sharma: మరో రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ..

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక.. ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా పోరులో రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్.. మిస్టర్ 360 డిగ్రీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 6, 2023 | 05:18 PMLast Updated on: Nov 06, 2023 | 5:18 PM

Rohit Sharma Levels Ab De Villiers In Six Hitting Spree Will Rohit Will Create New Record

Rohit Sharma: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)‌లో టీమిండియా (INDIA) దుమ్మురేపుతుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమిండియా ముందు నిలదొక్కుకోగలిగిన జట్టు లేదు. రోహిత్ (Rohit Sharma) సేన వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయాల పరంపరను కొనసాగించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా టీమిండియా వార్ వన్ సైడ్ చేసింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ముందు ఏ జట్టు కూడా నిలవలేకపోయింది. హాట్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన అన్ని జట్లను టీమిండియా మట్టికరిపించింది.

Naveen ul Haq: అప్పుడు విరాట్‌పై.. ఇప్పుడు ఆసీస్‌పై.. నవీన్ ఉల్ హక్ విమర్శలు..

ఆడిన 8 మ్యాచ్‌ల్లో 8 గెలిచి ఎదురులేకుండా దూసుకుపోతుంది రోహిత్ సేన. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక.. ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా పోరులో రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్.. మిస్టర్ 360 డిగ్రీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB de Villiers) రికార్డును సమం చేశాడు. ఈ రెండు సిక్సర్లతో ఈ ఏడాది మొత్తం 58 సిక్సర్లు బాదిన ఆటగాడిన హిట్ మ్యాన్ ఏబీడీ రికార్డును సమం చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. 2019లో ఏబీడీ 58 సిక్సర్లతో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును రోహిత్ సమం చేశాడు. అయితే.. ఈ వరల్డ్ కప్‌లోనే రోహిత్ శర్మ ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Virat Kohli : వెనక్కి తిరిగి చూడకు.. చెడుగుడు ఆడుకో..

ప్రస్తుత ఫామ్ బట్టి చూస్తే రోహిత్.. అవలీలగా ఆ రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ఆడిన 8 మ్యాచుల్లో రోహిత్ 442 పరుగులు చేశాడు. అది కూడా 100కి పైగా స్టైక్ రేట్‌తో. ఇది చాలు రోహిత్.. ఎంత ఫాస్ట్‌గా ఆడుతున్నాడో తెలుసుకోవడానికి. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక.. వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 22 సిక్సర్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేసులో నిలిచాడు.